Kannappa Movie: ప్రభాస్ వల్లే విష్ణు కన్నప్ప సినిమా చేస్తున్నాడా..?

Kannappa Movie: నిజానికి ఈ సినిమా 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇక ఇది ఎలా ఉంటుంది మంచు విష్ణు కి భారీ సక్సెస్ దక్కుతుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

Written By: Gopi, Updated On : June 18, 2024 12:03 pm

Is Manchu Vishnu doing the Kannappa movie because of Prabhas

Follow us on

Kannappa Movie: ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా 150 కోట్ల బడ్జెట్ తో కన్నప్ప అనే సినిమా తెరకెక్కుతుంది. అయితే రీసెంట్ గా ఈ సినిమా నుంచి టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో మంచు విష్ణు చాలా యాక్షన్ ఎపిసోడ్స్ లో పాల్గొంటూ భారీ డైలాగులు కూడా చెప్పాడు. ఇక మొత్తానికైతే ఈ టీజర్ మీద మిశ్రమ స్పందన వస్తుంది. కాబట్టి ఈ సినిమా అనేది విష్ణు కెరియర్ కి ఎంతవరకు యూజ్ అవుతుంది అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఇక నిజానికి ఈ సినిమా 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇక ఇది ఎలా ఉంటుంది మంచు విష్ణు కి భారీ సక్సెస్ దక్కుతుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక 15 కోట్ల మార్కెట్ కూడా లేని విష్ణు 150 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా చేయడం ఎందుకు అంటూ మరి కొంతమంది అతని మీద విమర్శలు చేస్తున్నారు. ఇక తను పెట్టిన బడ్జెట్ రికవరీ చేయాలనే ఉద్దేశ్యం తోనే మంచు విష్ణు ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్ యాక్టర్స్ ను తీసుకున్నాడు.

Also Read: Prabhas – Nithya Menon : ప్రభాస్ వలన నిత్యా మీనన్ కి తీరని అన్యాయం, అది జీవితంలో పెద్ద ఎదురుదెబ్బ అన్న మలయాళీ హీరోయిన్!

ఇక ఇదిలా ఉంటే మంచు విష్ణు బాహుబలి సినిమా చూసినప్పటి నుంచి అలాంటి ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడట. అందువల్లే కన్నప్ప సినిమాను బాహుబలి రేంజ్ లో ఊహించుకొని చేస్తున్నాడు అంటూ మరి కొంతమంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. మరి మొత్తానికైతే బాహుబలి సూపర్ సక్సెస్ అయినట్టుగా కన్నప్ప కూడా సూపర్ సక్సెస్ అవుతుందా లేదంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా మారుతుందా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి…

Also Read: Double iSmart: లైగర్ మూవీ ఎఫెక్ట్ డబుల్ ఇస్మార్ట్ మీద పడుతుందా..?

అయితే కన్నప్ప ఒక ముక్తి మార్గంలో భక్తి భావాన్ని నింపుకొని దేవుడి అనుగ్రహాన్ని పొందిన వ్యక్తి అలాంటి ఒక క్యారెక్టర్ పేరు పెట్టుకొని మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ తో నింపేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటూ ఈ టీజర్ పైన పలు విమర్శలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయితే గాని ఈ సినిమా సక్సెస్ అయిందా లేదా అనే దాని మీద సరైన క్లారిటీ అయితే రాదు…