https://oktelugu.com/

Darshan : అభిమానిని చంపిన హీరో దర్శన్ కి సపోర్ట్ చేస్తున్న అభిమానులు… ఏం జరుగుతోంది.?

Darshan ఇక ఇది చూసిన కొంతమంది ట్రేడ్ పండితులు అభిమానిని చంపిన కేసులో తను స్టేషన్ లో ఉంటే మళ్ళీ అభిమానులే తనకు అండగా నిలవడం ఏంటి ఈ అభిమానులకి బుర్ర ఉందా లేదా అంటూ వాళ్లపైన ఫైర్ అవుతున్నారు...

Written By:
  • NARESH
  • , Updated On : June 18, 2024 / 12:05 PM IST

    Fans supporting hero Darshan who killed a fan

    Follow us on

    Darshan : సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది అసలు ఎవరికీ అర్థం కావడం లేదు. కొంతమంది హీరోలు కామ్ గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ముందుకు సాగుతుంటే మరి కొంతమంది మాత్రం ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకుని వాళ్ళ భార్యలను హింసించి మొత్తానికైతే వాళ్లతో విడాకులు తీసుకుంటున్నారు. ఇక ఏది ఏమైనప్పటికి అన్ని ఇండస్ట్రీల్లో రెగ్యులర్ గా ఇదే కనిపిస్తుంది…ఇక ప్రస్తుతం కన్నడ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన దర్శన్ తన అభిమానిని చంపడం అనేది ఒక పెను సంచలనాన్ని సృష్టించింది. ఇక ఆయన వల్ల ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న మిగితా హీరోల పరువు కూడా పోతుందనే చెప్పాలి. ఎందుకంటే తమను అభిమానించే వ్యక్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత హీరోల పైన ఉంది. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే వీళ్ళు అండగా నిలిచి వాళ్లను ఆదుకోవాల్సింది పోయి వాళ్లే యముడి రూపంలో వచ్చి వారిని చంపడం అనేది నిజంగా తీవ్రమైన బాధను కలిగించే విషయమనే చెప్పాలి…

    ఇక కన్నడ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సైతం పోటీ పడుతూ తను కూడా ఒక స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న నటుడు దర్శన్… ‘చాలెంజింగ్ స్టార్’ గా కూడా తనను తాను చాలా సార్లు ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ఇక దర్శన్ పర్సనల్ విషయానికి వస్తే 2003 వ సంవత్సరంలో విజయలక్ష్మి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ వీళ్ళ మధ్య ఎప్పుడూ గొడవలు అయితే వస్తూ ఉండేవి. అలా 2011 వ సంవత్సరంలో విజయ లక్ష్మి దర్శన్ మీద గృహ హింస చట్టం కింద కేసు పెట్టింది. ఇక ఆ కేసు లో భాగంగా అందులో దర్శన్ కొద్దిరోజుల పాటు జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అలాగే ఇంకోసారి కూడా తను వేధింపుల కేసు పెడితే అప్పుడు కూడా జైలుకు వెళ్ళాడు. ఇలా తరచుగా జైలుకు వెళుతూ రావడం వల్ల దర్శన్ మీద సినిమా ఇండస్ట్రీలో గాని తన అభిమానుల్లో గాని చాలావరకు నెగిటివ్ ఇంప్రెషన్ అయితే ఏర్పడింది. ఇక విజయలక్ష్మి కి దూరంగా ఉంటూ వస్తున్న దర్శన్ కన్నడ నటి అయిన పవిత్ర గౌడ తో రిలేషన్ షిప్ ను మెయింటైన్ చేస్తున్నాడు.ఇదంతా జరిగిన కూడా ఇప్పటి వరకు దర్శన్ విజయ లక్ష్మి కి విడాకులు ఇవ్వలేదు.

    ఇక ఈ క్రమంలోనే దర్శన్ భార్య విజయలక్ష్మి పవిత్ర గౌడ్ కి చాలాసార్లు వార్నింగ్ లు కూడా ఇచ్చింది.దీంతో వీళ్ళ వ్యవహారం ఇండస్ట్రీ మొత్తానికి తెలిసిపోయింది. ఇక దాంతో రెచ్చిపోయిన పవిత్ర దర్శన్ తో పాటు ఉన్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది. ఇక దాని మీద కర్ణాటకలోని చిత్రదుర్గ అనే ప్రాంతానికి చెందిన ‘రేణుక స్వామి’ అనే వ్యక్తి స్పందిస్తూ పవిత్ర గౌడ మీద కొన్ని బ్యాడ్ కామెంట్స్ చేశాడు. తన అభిమాన హీరో అయిన దర్శన్ జీవితం పవిత్ర గౌడ వల్లే ఇలా తరయారైందని తను లేకపోతే తను హాయిగా తన భార్యతో కలిసి ఉంటాడు అంటూ రేణుక స్వామి చేసిన కామెంట్లను పర్సనల్ గా తీసుకున్న పవిత్ర గౌడ దర్శన్ తో చెప్పింది.

    ఇక దాంతో దర్శన్ రేణుక స్వామి కి వార్నింగ్ ఇచ్చి వదిలేద్దామని తన అనుచరులతో చెప్పి తనని రప్పించినప్పటికీ అనుచరులతోపాటు దర్శన్ కూడా రేణుక స్వామి ని కొన్ని దెబ్బలు కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. అలా అభిమానిని కొట్టి చంపిన కేసులో దర్శన్ నిందితుడిగా ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు…ఇక చిత్రమైన విషయం ఏంటి అంటే తన అభిమానిని కొట్టి చంపిన కేసులో దర్శన్ పోలీస్ స్టేషన్లో ఉంటే కొంతమంది తన అభిమానులు దర్శన్ ను వదిలి పెట్టాలని ధర్నాలు చేస్తున్నారు. ఇక ఇది చూసిన కొంతమంది ట్రేడ్ పండితులు అభిమానిని చంపిన కేసులో తను స్టేషన్ లో ఉంటే మళ్ళీ అభిమానులే తనకు అండగా నిలవడం ఏంటి ఈ అభిమానులకి బుర్ర ఉందా లేదా అంటూ వాళ్లపైన ఫైర్ అవుతున్నారు…