Koratala Siva: కొరటాల శివ చేసిన కామెంట్ల వల్ల దేవర మూవీ కలెక్షన్స్ మీద నెగిటివ్ ప్రభావం పడే అవకాశం ఉందా..?

సినిమా ఇండస్ట్రీ లో ఎంతమంది దర్శకులు ఉన్న కూడా సక్సెస్ ఫుల్ దర్శకులకు మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపు అయితే ఉంటుంది...వాళ్ళతోనే హీరోలు ఎక్కువగా సినిమాలు చేయాలని చూస్తుంటారు...

Written By: Gopi, Updated On : September 21, 2024 11:41 am

Koratala Siva

Follow us on

Koratala Siva: మిర్చి సినిమాతో దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న కొరటాల శివ ఇప్పుడు దేవర సినిమా చేశాడు… ఈ సినిమా మీదనే ఆయన భారీ ఆశలు పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆయన చేస్తున్న ప్రతి సినిమా భారీ సక్సెస్ ని అందుకుంటూ వచ్చినప్పటికీ చిరంజీవితో చేసిన ఆచార్య సినిమాతో ఆయన పూర్తిగా ఢీలా పడిపోయారు. ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో కొరటాల శివ ఒక్కసారిగా పాతాళానికి నెట్టివేయబడ్డాడు. కాబట్టి ఇప్పుడు దేవర సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక దానికి సంబంధించినట్టుగానే ఈ సినిమా మీద భారీ ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కొరటాల ఆచార్య సినిమా మీద ఇన్ డైరెక్టుగా కొన్ని కామెంట్స్ చేశాడు. ఇక తను ‘ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే బాగుంటుందని’ తను మాట్లాడిన మాటలు ఇన్ డైరెక్ట్ గా చిరంజీవి గారిని ఉద్దేశించే మాట్లాడాడు అంటూ పలువురు పలు రకాల విమర్శలైతే చేస్తున్నారు.

నిజానికి కొరటాల శివ దేవర సినిమా రిలీజ్ సమయంలో అలాంటి మాటలు మాట్లాడకుండా ఉండుంటే బాగుండేదని పలువురు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఎందుకంటే సినిమా రిలీజ్ సమయంలో ఇలాంటి పొరపాటు మాటల వల్ల ఆయన సినిమాకి భారీగా నష్టం వాటిల్లే అవకాశాలైతే ఉంటాయి. నిజానికి ఆయన చిరంజీవిని ఉద్దేశించి అలా మాట్లాడడా లేదంటే క్యాజువల్ గా మాట్లాడడా? అనే విషయం పక్కన పక్కన పెడితే, చిరంజీవికి కొరటాల శివకి ఆచార్య విషయంలో కొంతవరకు మిస్ కమ్యూనికేషన్ జరిగిన విషయం మనకు తెలిసిందే.

కాబట్టి ఇప్పుడు కొరటాల ఇలాంటి మాటలు మాట్లాడటం వల్ల ఇన్ డైరెక్టుగా ఆయనను ఉద్దేశించే మాట్లాడుతున్నాడనే కామెంట్లు అయితే వస్తూ ఉంటాయి. ఇక పోయి పోయి సినిమా రిలీజ్ ఉన్న సమయంలోనే మెగాస్టార్ మీద ఇలాంటి కామెంట్స్ చేయడం ఆయన అభిమానులను తీవ్రంగా కలిచి వేస్తుందనే చెప్పాలి. మరి ఈ సినిమా కలెక్షన్ల మీద ఈ ప్రభావం ఎంతవరకు ఉండబోతుందనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే దేవర సినిమా ఇటు ఎన్టీఆర్ కి అటు కొరటాల శివ ఇద్దరికీ భారీ సక్సెస్ గా మిగిలితేనే వీళ్ళు పాన్ ఇండియాలో భారీ స్టార్లుగా వెలుగొందుతారు.

లేకపోతే మాత్రం ఇద్దరూ తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఈ సినిమాతో మరి వీళ్ళు ఎలాంటి రిజల్ట్ ని సంపాదించుకుంటారనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది…ఇక సినిమా యూనిట్ ఇప్పటికే ప్రమోషన్స్ మీద ప్రమోషన్స్ చేస్తూ భారీ అంచనాలను పెంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు…