Vishwambhara Movie: యావత్ ఇండియన్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే పరిచయం అక్కర్లేని పేరు అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఇప్పటి వరకు ఎన్నో రికార్డులను కూడా క్రియేట్ చేశాడు. “చిరంజీవి లాంటి ఒక నటుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉండడం మన అదృష్టం” అంటూ అమితాబచ్చన్ లాంటి దిగ్గజ నటుడు కూడా ఈ విషయాన్ని తెలియజేయడం అనేది నిజంగా చిరంజీవి యొక్క గొప్పతనాన్ని ఇండియన్ సినిమా అభిమానులకి తెలియజేసింది.
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం ఆయన విపరీతంగా కష్టపడుతున్నట్టుగా కూడా సినిమా యూనిట్ నుంచి ప్రశంసల వర్షాన్నైతే కురిపిస్తున్నారు. ఇక అందరూ మెగాస్టార్లు ఊరికే అయిపోరు అని చెప్పడానికి చిరంజీవి ఈ సినిమాలో పడుతున్న కష్టమే నిదర్శనం అంటూ ఈ సినిమా దర్శకుడు అయిన వశిష్ట ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక ఇదిలా ఉంటే చిరంజీవి ఈ సినిమాలో కూడా హిట్ ఫార్ములానే వాడుతున్నాడు అంటూ మరొకొన్ని వార్తలైతే వస్తున్నాయి.
అది ఏంటి అంటే చిరంజీవికి ఈ సినిమాలో ముగ్గురు సిస్టర్స్ ఉంటారట. ఇక సిస్టర్ సెంటిమెంట్ తో ఈ సినిమా సాగనున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. అయితే మెయిన్ స్టోరీ అది అయి ఉండకపోయిన కూడా సబ్ ప్లాట్ కింద సిస్టర్ సెంటిమెంట్ అనే పాయింట్ ను రైజ్ చేసి దాని ద్వారా ఎమోషన్ ని వర్కౌట్ చేయాలనే ఉద్దేశ్యం లో సినిమా దర్శకుడు అయిన వశిష్ట ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. మరి మొత్తానికైతే తను అనుకున్నట్టుగానే ఈ సినిమాలో కూడా సిస్టర్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా?
ఇంతకుముందు చిరంజీవి హిట్లర్ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. ఆ సినిమా సూపర్ సక్సెస్ గా మారింది. ఇక ఇప్పుడు విశ్వంభర సినిమా కూడా ఆయనకు ఎంత వరకు సక్సెస్ ని సాధించి పెడుతుంది అనే విషయం కూడా తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే చిరంజీవి సక్సెస్ కోసం మరోసారి సిస్టర్ సెంటిమెంట్ నే వాడుకుంటున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి…