NBK109: బాలయ్య బాబీ సినిమాలో ఐటెం సాంగ్ చేయనున్న మహేష్ బాబు హీరోయిన్…

బాలయ్య తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ సక్సెస్ ను సాధిస్తాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే ఈ సినిమా 50% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.

Written By: Gopi, Updated On : May 16, 2024 2:03 pm

Meenaakshi Chaudhary Doing Special song in NBK109

Follow us on

NBK109: నందమూరి నటసింహంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న బాలయ్య బాబు ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో మరోసారి బాలయ్య తనను తాను ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఇప్పటికే వరుసగా మూడు సక్సెస్ లను అందుకున్న బాలయ్య బాబు ఈ సినిమాతో మరోసారి నాలుగో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

ఇక బాలయ్య తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ సక్సెస్ ను సాధిస్తాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే ఈ సినిమా 50% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇక ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ లో కూడా యాక్షన్ ఎపిసోడ్స్ నే హైలెట్ చేశారు. ఇక మొత్తానికైతే బాలయ్య బాబు ఈ సినిమాతో మరోసారి భారీ బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని దక్కించుకోబోతున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే బాలయ్య బాబు సినిమాల్లో సాంగ్స్ చాలా హైలైట్ గా నిలుస్తూ ఉంటాయి.

ఇక అందుకే ఆయన సినిమాల్లో మ్యూజిక్ డైరెక్టర్లు చాలా సపరేట్ గా మ్యూజిక్ ను డిజైన్ చేస్తూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ కూడా దర్శకుడు డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన ‘గుంటూరు కారం’ సినిమా లో సెకండ్ హీరోయిన్ గా నటించిన “మీనాక్షి చౌదరి” ఈ ఐటెం సాంగ్ లో కనిపించబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

అయితే ఇప్పటికే డైరెక్టర్ బాబీ ఆమెను సంప్రదించారట. ఇక ఆమె కూడా ఐటెం సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక మొత్తానికైతే మహేష్ బాబు మీనాక్షి చౌదరీ తో సందడి చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది…