Fahadh Faasil: పుష్ప 2 లో ఫహాద్ ఫాజిల్ (శికవత్ సార్) ఏం చేయబోతున్నాడు..?

పుష్ప పార్ట్ వన్ చివర్లో వచ్చి తను తన మ్యాజిక్ ని రిపీట్ చేశాడు. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమాలో కూడా తన క్యారెక్టర్ తో ప్రేక్షకులందరికీ కిక్ ఎక్కించే విధంగా నటించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

Written By: Gopi, Updated On : May 16, 2024 1:49 pm

What is Fahadh Faasil going to do in Pushpa 2

Follow us on

Fahadh Faasill: పాన్ ఇండియాలో చాలా ఎక్కువమంది ఆత్రుతగా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది పుష్ప 2 అనే చెప్పాలి. అయితే ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటించిన విషయం మనకు తెలిసిందే.. ఇక పుష్ప పార్ట్ వన్ చివర్లో వచ్చి తను తన మ్యాజిక్ ని రిపీట్ చేశాడు. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమాలో కూడా తన క్యారెక్టర్ తో ప్రేక్షకులందరికీ కిక్ ఎక్కించే విధంగా నటించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

మరి ఆయన ఎలాంటి రివెంజ్ తీర్చుకున్నాడు అనేది ప్రధానాంశంగా సెకండ్ పార్ట్ సాగబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఇలాంటి క్రమంలో పుష్ప 2 సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధించబోతుంది అనేది కూడా చాలా కీలకమైన అంశంగా మారబోతుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అల్లు అర్జున్ ఫాహాద్ ఫాజిల్ మధ్య కొన్ని ఎపిసోడ్లు టగ్ ఆఫ్ ఫర్ గా నడవబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

అయితే పుష్ప శికావత్ సార్ కి స్ట్రోక్ ఇస్తాడా లేదా శికావత్ సార్ పుష్ప కి కౌంటర్ ఇస్తాడా అనేది తెలియాలంటే పుష్ప 2 సినిమా మాత్రం పక్క చూడాల్సిందే అని సినిమా యూనిట్ అయితే గట్టిగా చెబుతున్నారు. మరి ఇదిలా ఉంటే ఫహాద్ ఫాజిల్ ఇంతకుముందు పోషించిన చాలా కీలకమైన పాత్రలతో పోల్చుకుంటే ఈ పాత్ర కూడా నటనకి చాలా స్కోప్ ఉన్న పాత్ర అనే చెప్పాలి. అయితే యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్ర కావడం వల్లే సుకుమార్ ఈ క్యారెక్టర్ లో ఫహాద్ ఫాజిల్ ను తీసుకున్నాడు.

మరి ఆయన ఏ మేరకు ఈ పాత్రలో రాణించి పుష్ప 2 సక్సెస్ లో కీలక పాత్ర వహిస్తాడు అనేది కూడా ఇప్పుడు తెలియాల్సి ఉంది… ఇక మొత్తానికైతే ఇటు సుకుమార్, అటు అల్లు అర్జున్ ఇద్దరు కూడా ఈ సినిమా పాన్ ఇండియాలో భారీ సక్సెస్ అయితే సాధిస్తుందనే నమ్మకం అయితే పెట్టుకున్నారు…