Akira Nandan: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులతో పాటు, ఇండస్ట్రీ మొత్తం అత్యంత ఆసక్తిగా పవన్ కళ్యాణ్ పెద్ద కొడుకు అకిరా నందన్(Akira Nandan) ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు.ఎందుకంటే రీసెంట్ గా అకిరా నందన్ లుక్స్ ని చూసిన అభిమానులు ఆశ్చర్యపోయారు. మెగా ఫ్యామిలీ లో ఇలాంటి అందగాడు, కటౌట్ ఉన్న హీరోనే లేడని, కుర్రాడి ముఖం లో మంచి స్పార్క్ ఉందని, ఇండస్ట్రీ లోకి అడుగుపెడితే ఎక్కడికో వెళ్ళిపోతాడని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. అయితే అకిరా కి సినిమాల్లోకి రావడం పై ఆసక్తి లేదని అప్పట్లో అతని తల్లి రేణు దేశాయ్ కామెంట్స్ చేసింది కానీ, ఆ తర్వాత అకిరా నందన్ ని యాక్టింగ్ స్కూల్ లో చేర్పించారని, మరో రెండేళ్లలో అతని గ్రాండ్ ఎంట్రీ ఉండబోతుందని సమాచారం. అకిరా నందన్ మొదటి సినిమాని రామ్ చరణ్(Global Star Ram Charan) నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు.
Also Read: గేమ్ ఛేంజర్ నష్టాలను సంక్రాంతికి వస్తున్నాం బ్యాలన్స్ చేసిందా?… దిల్ రాజు సమాధానం ఇదే!
ఆయనతో పాటు వైజయంతి మూవీస్ బ్యానర్ కూడా నిర్మాణం లో పాలు పంచుకోనుంది. రీసెంట్ గానే రామ్ చరణ్ ఒక పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ కి అడ్వాన్స్ గా ఒక బ్లాంక్ చెక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎంత రెమ్యూనరేషన్ కావాలంటే అంత తీసుకో, రెండేళ్లలో నీకు ఉన్న కమిట్మెంట్స్ మొత్తం పూర్తి చేసుకొని అకిరా కి దర్శకత్వం వహించడానికి సిద్ధం గా ఉండు అని చెప్పినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో ఒక టాక్ తెగ వైరల్ గా మారింది. ఆ డైరెక్టర్ ఎవరు, ఏమిటి అనేది తెలీదు కానీ, ఇటీవలే ఆ డైరెక్టర్ రామ్ చరణ్ కి, అదే విధంగా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లకు కూడా స్టోరీ ని వినిపించాడని తెలుస్తుంది. ఆ లైన్ కి ముగ్గురు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న గాసిప్ ఏమిటంటే, అకిరా మొదటి సినిమాకి ‘సమురాయ్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారని అంటున్నారు.
ఈ చిత్రం కేవలం పాన్ ఇండియా లెవెల్ లోనే కాదు, పాన్ వరల్డ్ రేంజ్ స్కోప్ తో తెరకెక్కిస్తున్నారట. ఈ ఏడాది లో అకిరా నందన్ యాక్టింగ్ లో కోర్స్ పూర్తి చేయనున్నాడు. ఇప్పటికే అతనికి సంగీతం, ఫైట్స్ వంటివి బాగా వచ్చు. వచ్చే ఏడాది మొత్తం ఆయన సరికొత్త మేక్ ఓవర్ మీద ద్రుష్టి పెట్టబోతున్నాడట. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ మూవీ క్లైమాక్స్ లో అకిరా నందన్ ని నటింపచేసే ఆలోచన లో ఉన్నాడట ఆ చిత్ర డైరెక్టర్ సుజిత్. కేవలం పవన్ కళ్యాణ్ అనుమతి కోసమే ఎదురు చూస్తున్నారట. అదే విధంగా ‘ఓజీ’ సీక్వెల్ లో హీరో గా అకిరా నందన్ ఉంటాడని, పవన్ కళ్యాణ్ ఇందులో స్పెషల్ రోల్ లో మాత్రమే కనిపిస్తాడని ఒక టాక్ కూడా నడుస్తుంది. మొత్తానికి అకిరా సినీ రంగ ప్రవేశానికి భారీ ప్లానింగ్స్ చేస్తున్నారు అనేది స్పష్టంగా అర్థం అవుతుంది.
Also Read: ఆ ముగ్గురితో సీన్ అంటే ఎన్టీఆర్ కి చాలా కష్టం.. టేకులు మీద టేకులు! ఎందుకు అలా?