Junior NTR : నందమూరి తారక రామారావు నట వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు. బాల్యంలోనే రాముడి పాత్ర చేసి ఔరా అనిపించాడు. ఎన్టీఆర్ టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా ఉన్నారు. ఆర్ ఆర్ ఆర్, దేవర చిత్రాలతో పాన్ ఇండియా హీరో బెర్త్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఎన్టీఆర్ చాలా ప్రతిభ గల నటుడని ఆయనతో పని చేసిన దర్శకులు తెలియజేశారు. రెండు పేజీల డైలాగ్ ని కూడా ఆయన ఒక్కసారి చూసి గుర్తు పెట్టుకోగలడట.
ఇక డాన్స్ అయితే చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా డాన్స్ చేసే ఓన్లీ హీరో ఎన్టీఆర్ అని, కొరియోగ్రాఫర్స్ చెబుతారు. బాల్యంలో క్లాసికల్ డాన్స్ నేర్చుకున్న ఎన్టీఆర్, ప్రదర్శనలు ఇచ్చాడు. సినిమాల్లో బెస్ట్ డాన్సర్ గా అవతరించడానికి అది దోహదం చేసింది. ఎన్టీఆర్ లో ఉన్న మరో ప్రతిభ ఆయన సింగర్ కూడాను. పలు చిత్రాల్లో ఆయన పాటలు పాడారు. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అయిన ఎన్టీఆర్.. ఓ ముగ్గురు నటులతో చేసే టప్పుడు మాత్రం చాలా టేక్స్ తీసుకుంటాడట.
Also Read : జూనియర్ ఎన్టీఆర్ ని అవమానించిన క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్..మండిపడుతున్న ఫ్యాన్స్!
అది ఒకరు బ్రహ్మానందం, రెండు అలీ, మూడు వేణు మాధవ్ అట. వీరితో కామెడీ సీన్ అంటే.. ఎన్టీఆర్ కి నవ్వు వచ్చేస్తుందట. దాన్ని కంట్రోల్ చేసుకోలేదట. దాని వలన ఎక్కువ టేక్స్ పడతాయట. ఈ విషయాన్ని ఎన్టీఆర్ నేరుగా తెలియజేశాడు. బృందావనం మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ ని కమెడియన్ వేణు మాధవ్ ఇంటర్వ్యూ చేశాడు. అప్పుడు ఎన్టీఆర్ ఈ విషయం చెప్పాడు. హీరోయిన్స్ తో కూడా ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయా? ఉంటే ఆ హీరోయిన్స్ ఎవరని వేణు మాధవ్ అడిగాడు. హీరోయిన్స్ తో నాకు ఏ సమస్యలేదు. టేక్స్ తీసుకోనని చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 మూవీ చేస్తున్నారు. ఇది షూటింగ్ దశలో ఉంది. హృతిక్ రోషన్ మరొక హీరోగా నటిస్తున్నాడు. అనంతరం కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మూవీకి సిద్ధం అవుతున్నాడు. డ్రాగన్ అనే టైటిల్ ప్రచారం లో ఉంది. మాఫియా బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని సమాచారం.
Also Read : అల్లు అర్జున్-అట్లీ మూవీలో మరో హీరో.. ఆ స్టార్ కోసం రాసిన కథనా?