Homeఎంటర్టైన్మెంట్Dilruba Trailer Review: దిల్ రూబా ట్రైలర్ రివ్యూ: కిరణ్ అబ్బవరం దంచేశాడు, డైలాగ్స్ అదుర్స్!...

Dilruba Trailer Review: దిల్ రూబా ట్రైలర్ రివ్యూ: కిరణ్ అబ్బవరం దంచేశాడు, డైలాగ్స్ అదుర్స్! హైలెట్స్ ఇవే

Dilruba Trailer Review: క మూవీతో చెప్పి మరీ హిట్ కొట్టాడు కిరణ్ అబ్బవరం. క మూవీ నచ్చకపోతే, హిట్ కాకపోతే ఇకపై సినిమాలు చేయనంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అతని విశ్వాసాన్ని నిలబెడుతూ క… బ్లాక్ బస్టర్ అయ్యింది. దాదాపు రూ. 50 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఆ మూవీ బడ్జెట్ రీత్యా క భారీ విజయం అందుకున్నట్లే లెక్క. క విడుదలై ఆరు నెలలు గడవక ముందే మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు.

కిరణ్ అబ్బవరం నటించిన దిల్ రూబా మూవీ మార్చ్ 14న థియేటర్స్ లోకి వస్తుంది. విశ్వ కరుణ్ ఈ చిత్రానికి దర్శకుడు. రుక్షర్ థిల్లాన్, కాత్య దావిసన్ హీరోయిన్స్ గా నటించారు. సామ్ సీఎస్ సంగీతం అందించాడు. దిల్ రూబా ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేదిగా ఉంది. లవ్, ఎమోషన్, కామెడీ, యాక్షన్ అంశాలతో కమర్షియల్ డ్రామాగా తెరకెక్కించారు. ట్రైలర్ లో డైలాగ్స్ హైలెట్ అని చెప్పాలి. ‘దేవుడు ఎప్పుడు మాట్లాడటం మానేశాడో తెలుసా సిద్దూ.. మనిషి మోసం చేయడం మొదలుపెట్టినప్పుడు’ వంటి డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.

Also Read: అకిరా నందన్ మొదటి సినిమా టైటిల్ అదేనా..? అభిమానులకు ఆసక్తి రేపుతున్న లేటెస్ట్ అప్డేట్!

యాక్షన్, ఎమోషన్ సినిమాలో గట్టిగా దట్టించారు అనిపిస్తుంది. సాంకేతిక విలువలు బాగున్నాయి. బీజీఎమ్ సైతం బాగుంది. కిరణ్ అబ్బవరం గత సినిమాలతో పోల్చితే హ్యాండ్సమ్ గా ఉన్నాడు. హీరోయిన్ రుక్షర్ కి స్క్రీన్ స్పేస్ ఉన్న రోల్ దక్కినట్లు అనిపిస్తుంది. మొత్తంగా దిల్ రూబా ట్రైలర్ ఆకట్టుకుంది. కిరణ్ అబ్బవరం మరో హిట్ కొట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాను కిరణ్ అబ్బవరం వినూత్నంగా ప్రమోట్ చేస్తున్నాడు.

దిల్ రూబా మూవీ కథను అంచనా వేసిన కరెక్ట్ గా చెప్పిన వారికి బైక్ బహుమతి అంటూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. దిల్ రూబా ప్రీ రిలీజ్ ఈవెంట్లో బైక్ గిఫ్ట్ గా ఇవ్వడంతో పాటు, సినిమా విడుదల రోజు అతనితో కలిసి థియేటర్ కి వెళ్లి మూవీ చూస్తాడట.

 

 

RELATED ARTICLES

Most Popular