Dil Raju (1)
Dil Raju: డిస్ట్రిబ్యూటర్ గా ప్రస్థానం మొదలుపెట్టిన దిల్ రాజు.. స్టార్ ప్రొడ్యూసర్ అయ్యాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో అద్భుతమైన చిత్రాలు నిర్మించాడు. దిల్ రాజు సినిమా అంటే విషయం ఉంటుంది అనే గుడ్ విల్ జనాల్లో ఉంటుంది. బడా నిర్మాతగా పెద్ద చిత్రాలు చేస్తూనే.. డిస్ట్రిబ్యూషన్ కూడా ఆయన కొనసాగిస్తున్నారు. సొంత బ్యానర్ లో నిర్మించిన చిత్రాలతో పాటు ఇతర నిర్మాతల చిత్రాలు కూడా ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తాడు.
Also Read: పుట్టిన రోజు సందర్బంగా జాన్వీ కపూర్ స్పెషల్ ఫోటోలు..
కొన్నాళ్లుగా దిల్ రాజుకు భారీ షాక్స్ తగులుతున్నాయి. శాకుంతలం, ది ఫ్యామిలీ స్టార్ చిత్రాలతో పెద్ద మొత్తంలో నష్టపోయాడు. రామ్ చరణ్-శంకర్ కాంబోలో గేమ్ ఛేంజర్ నిర్మించాడు. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం తెరకెక్కింది. ఈ రెండు చిత్రాలు 2025 సంక్రాంతి కానుకగా విడుదలయ్యాయి. దాదాపు రూ. 400 కోట్లతో నిర్మించిన గేమ్ ఛేంజర్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. ప్రేక్షకుల నుండి ఆశించిన స్పందన దక్కలేదు.
అయితే కేవలం రూ. 50-60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్నాం ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. వెంకటేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా సంక్రాంతికి వస్తున్నాం మూవీ నిలిచింది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. ట్రేడ్ వర్గాలను విస్మయపరుస్తూ సంక్రాంతికి వస్తున్నాం రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. గేమ్ ఛేంజర్ తో భారీ నష్టాలు చవి చూసిన దిల్ రాజుకు సంక్రాంతికి వస్తున్నాం ఊరట ఇచ్చింది.
సంక్రాంతికి రెండు చిత్రాలు విడుదల చేశారు. ప్లాప్ మూవీ నష్టాలను హిట్ మూవీ కవర్ చేసిందా అని దిల్ రాజును మీడియా ప్రతినిధులు అడిగారు. నేను జనవరి 1 నుండి డిసెంబర్ 31వరకు ఆ ఏడాది ఎన్ని సినిమాలు తీశాము, డిస్ట్రిబ్యూట్ చేశాము.. వాటి ఫలితాల ఆధారంగా బాలన్స్ షీట్ చూసి.. లాభాల్లో ఉన్నామా? నష్టాల్లో ఉన్నామా? అని చెక్ చేసుకుంటాము. నేను ఒక్క సినిమా కాదు కదా, అనేక సినిమాలు నిర్మిస్తాను, డిస్ట్రిబ్యూట్ చేస్తాను. ఆ విషయం నేను చెప్పలేను అని సమాధానం దాటవేశారు. ప్రస్తుతం దిల్ రాజు నితిన్ హీరోగా తమ్ముడు మూవీ చేస్తున్నాడు. మరికొన్ని ప్రాజెక్ట్ చర్చల దశలో ఉన్నాయి. సరైన హిట్ లేక అల్లాడుతున్న దిల్ రాజును సంక్రాంతికి వస్తున్నాం మాత్రం కాపాడింది అనేది నిజం.
Web Title: Dil raju made interesting comments game changer and sankranthiki vasthunam
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com