Homeఎంటర్టైన్మెంట్Pushpa Movie: "పుష్ప" సినిమా హిందీ వెర్షన్ లో అల్లు అర్జున్ కి డబ్బింగ్ చెప్పింది...

Pushpa Movie: “పుష్ప” సినిమా హిందీ వెర్షన్ లో అల్లు అర్జున్ కి డబ్బింగ్ చెప్పింది ఎవరంటే…

Pushpa Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక హీరో హీరోయిన్స్ గా సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘పుష్ప’. ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్నాడు. తెలుగు, తమిళ్,మలయాళం, కన్నడతో పాటు హిందీలో కూడా ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. సుకుమార్ – బన్నీ కలయికలో వస్తున్న మూడో చిత్రం ఇది. ఈ సినిమాతో అల్లు అర్జున్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. ‘పుష్ప’ సినిమాని డిసెంబర్‌ 17న రిలీజ్ చేయనున్నారని ప్రకటించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. అయితే ఈ సినిమా హిందీ వర్షన్ లో అల్లు అర్జున్ పాత్రకి వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా డబ్బింగ్ చెప్పిన నటుడే వెల్లడించాడు.

interesting news about dubbing artist for allu arjun pushpa hindi version

‘రేవతి’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ‘ఓం శాంతి ఓం’ సినిమాతో పేరు తెచ్చుకున్న శ్రేయాస్‌ తల్పడే ‘పుష్ప’ హిందీ వర్షన్ లో అల్లు అర్జున్ కి డబ్బింగ్ చెప్పాడు. ఈ విషయాన్ని తానే స్వయంగా ట్విట్టర్ లో షేర్ చేశాడు. ట్విట్టర్ లో ఈ విషయాన్ని షేర్ చేస్తూ.. భారతదేశపు పవర్‌ఫుల్‌, స్టైలిష్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ నటించిన ‘పుష్ప’ హిందీ వర్షెన్‌కు అల్లు అర్జున్ పాత్రకి వాయిస్‌ ఇచ్చాను. చాలా గర్వంగా, సంతోషంగా ఉంది అంటూ ట్వీట్‌ చేశాడు శ్రేయాస్. ఇతను నటుడిగా దాదాపు 30 సినిమాలకు పైగానే నటించాడు. అంతే కాక డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు శ్రేయాస్ తల్పడే. హిందీ ‘పుష్ప’ ట్రైలర్ లో శ్రేయాస్ వాయిస్ విని బాగుంది అని మన తెలుగు అభిమానులు మెచ్చుకుంటున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ కు రాం రాం.. తెలంగాణ హైకోర్టు సంచలనం

HYDRA Ranganath: హైడ్రా.. తెలంగాణలో 2023లో కొలువుదీరిన రేవంత్‌రెడ్డి సర్కార్‌ హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువులు, కుంటల ఆక్రమణల తొలగింపు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు సహాయ సహకారాలు అదించేందుకు ఏర్పాటు...

Kerala Innovation: అమ్మ కష్టం చూడలేక.. ఈ కొడుకు చేసిన పని.. ఏకంగా సీఎం చప్పట్లు కొట్టాడు..

Kerala Innovation: ఉదయం లేవగానే ఇల్లు ఊడ్చి.. కల్లాపి చల్లాలి. ముగ్గు పెట్టాలి. బట్టలు ఉతకాలి. టీ దగ్గర నుంచి మొదలు పెడితే కూర వరకు వండాలి. ఇంటిని శుభ్రం చేయాలి. ఇన్ని...
Oktelugu Epaper
Exit mobile version