https://oktelugu.com/

Akhanda Movie: పోటీ లేకుండా దూసుకుపోతున్న బాలయ్య “అఖండ” మూవీ…

Akhanda Movie: నటసింహం బాలకృష్ణ మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో విడుదలైన “అఖండ”చిత్రం అఖండమైన విజయాన్ని అందుకోగా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. సెకండ్ వేవ్ కరోనా తర్వాత భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్లో మంచి స్పందన అందుకోగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది అనే చెప్పాలి.బాలయ్య కెరీర్లో హైయెస్ట్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టుకుంటూ ఈ సినిమా ముందుకు వెళ్తోంది. ఈ డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ కూడా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 11, 2021 / 08:37 PM IST
    Follow us on

    Akhanda Movie: నటసింహం బాలకృష్ణ మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో విడుదలైన “అఖండ”చిత్రం అఖండమైన విజయాన్ని అందుకోగా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. సెకండ్ వేవ్ కరోనా తర్వాత భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్లో మంచి స్పందన అందుకోగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది అనే చెప్పాలి.బాలయ్య కెరీర్లో హైయెస్ట్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టుకుంటూ ఈ సినిమా ముందుకు వెళ్తోంది.

    ఈ డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ కూడా హౌస్ ఫుల్స్ పడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వీకెండ్లో అయితే సినిమా జోరు గురించి ఎంత చెప్పినా తక్కువే. దీనికి కారణం బాలయ్య “అఖండ” చిత్రానికి గట్టి పోటీ ఇచ్చే హీరో మూవీ లేకపోవడం అనే చెప్పుకోవాలి. తాజాగా విడుదలైన నాగశౌర్య “లక్ష్య”, శ్రియ సరన్ “గమనం” వీటితో పాటు మరికొన్ని చిన్న సినిమాలు కూడా బరిలోకి దిగాయి. అయితే నాగశౌర్య “లక్ష్య” సినిమా మాస్ టచ్ ఉన్న సినిమా అయినప్పటికీ ఈ చిత్రం పై ప్రేక్షకులు ఆసక్తి అంతంత మాత్రమే ఉంది అని చెప్పాలి.

    మరోవైపు ‘గమనం’ చిత్రాం కుడా ఒక మోస్తరుగా ప్రేక్షకులు స్పందిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. కాస్తోకూస్తో పెద్ద సినిమాలైనా ఈ వీటి గురించే అలా అలా టాక్ వస్తే ఇంకా చిన్న సినిమాల సంగతి చెప్పనక్కర్లేదు. అయితే “అఖండ” చిత్రానికి బాగానే కలిసొచ్చేలా ఉంది రెండో వీకెండ్లోనూ ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టేలా కనిపిస్తోంది. ఈ రోజు సాయంత్రానికి శని, ఆదివారాలకు అడ్వాన్స్ బుకింగ్స్ ఆశాజనకంగా ఉన్నాయి. అల్లు అర్జున్ “పుష్ప” సినిమా వచ్చే వరకు బాలయ్య “అఖండ” సినిమాకు ఎదురు లేదని చెప్పాలి.