Nagababu: నాగబాబు నాన్ వెజ్ మానేయడానికి వెనుక ఇంత పెద్ద కథ ఉందా..? ప్రతీ ఒక్కరు ఇది ఫాలో అయితే ఎంత బాగుంటుంది!

ఆయన మాట్లాడుతూ 'ఒకసారి నాకు తీవ్రమైన జ్వరం వచ్చింది, దానివల్ల ఊపిరి తిత్తుల సమస్యలు తలెత్తేవి. ఆ మధ్య కాలం లో నాకు గొంతు బాగా చెడిపోవడాన్ని మీరంతా గమనించే ఉంటారు. అప్పటి నుండి నేను నా ఆరోగ్యం పట్ల చాలా ప్రత్యేకమైన శ్రద్ద తీసుకున్నాను.

Written By: Vicky, Updated On : June 13, 2023 5:03 pm

Nagababu

Follow us on

Nagababu: ముక్క లేనిదే అన్నం ముద్ద కూడా గొంతులో దింపుకోలేని ఎంతో మంది మనుషులను మనం మన రెగ్యులర్ జీవితం లో చూస్తూనే ఉంటాం. నాన్ వెజ్ లేకపోతే ఇల్లు పీకి పందిరి వేసిన వాళ్ళని కూడా మనం చూసాము. వాళ్ళని చూసి వెజిటేరియన్స్ అసలు ఒక జీవిని హింసపెట్టి, నరికి చంపి, అలా ఎలా తింటారు, పాపం కదా అని చిన్నతనం నుండే నాన్ వెజ్ వైపు కనీసం చూడరు వెజిటేరియన్స్.

అయితే కొంతమంది కొన్ని కారణాల చేత నాన్ బాగా తినే అలవాటు ఉన్నప్పటికీ మధ్యలో మానేస్తుంటారు, మరికొంత మంది అయితే జీవ హింస మహాపాపం అని మధ్యలో పరివర్తన చెంది నాన్ వెజ్ మానేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారిలో మెగా బ్రదర్ నాగ బాబు కూడా ఉన్నాడు. రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో నాన్ వెజ్ ని మానేయడానికి గల కారణాలను చెప్పుకొచ్చాడు.

ఆయన మాట్లాడుతూ ‘ఒకసారి నాకు తీవ్రమైన జ్వరం వచ్చింది, దానివల్ల ఊపిరి తిత్తుల సమస్యలు తలెత్తేవి. ఆ మధ్య కాలం లో నాకు గొంతు బాగా చెడిపోవడాన్ని మీరంతా గమనించే ఉంటారు. అప్పటి నుండి నేను నా ఆరోగ్యం పట్ల చాలా ప్రత్యేకమైన శ్రద్ద తీసుకున్నాను. చిన్న చిన్న చెడు అలవాట్లు ఉండేవి, అవి కూడా మానేసాను. అంతకు ముందు నాన్ వెజ్ ఒక రేంజ్ లో తినేవాడిని, కానీ నాన్ వెజ్ తినాలంటే ఒక ప్రాణిని హింస పెట్టి , చంపి తినడం నాకు చాలా బాధ అనిపించింది. ఈ విషయం మొదటి నుండి నా మైండ్ లో బలమైన అసంతృప్తి నా పైనే ఉండేది. ఒక రోజు నాన్ వెజ్ మానేయాలి అనుకున్న మానేసాను, అంతే కాదు పాలు , పెరుగు తినడం కూడా మహాపాపమే,మిల్క్ ప్రొడక్ట్స్ కూడా అందుకే ఈమధ్య తీసుకోవడం లేదు, కేవలం ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ఐటమ్స్ ని తింటూ బ్రతుకుతున్నాను ‘ అంటూ చెప్పుకొచ్చాడు నాగబాబు.