Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan And Nagababu: పవన్ కళ్యాణ్ ను కొట్టిన నాగబాబు... దానికి పవర్ స్టార్...

Pawan Kalyan And Nagababu: పవన్ కళ్యాణ్ ను కొట్టిన నాగబాబు… దానికి పవర్ స్టార్ రియాక్షన్ ఏంటంటే…

Pawan Kalyan And Nagababu: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటుంది. ఇప్పటివరకు తను సాధించిన విజయాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇకమీదట తన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా వరకు కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. హెల్త్ తనకు సరిగ్గా సహకరించక పోయినా కూడా అన్ని తానై ఒక్కడే చేసుకుంటూ కొన్ని యాక్షన్స్ సన్నివేశాల్లో సైతం డూప్ లేకుండా ఓన్ గా పాల్గొంటున్నాడు అంటే చిరంజీవికి సినిమాలు అంటే ఎంత ఇష్టమో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక చిరంజీవి ఇన్స్పిరేషన్ తో వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ప్రస్తుతం టాప్ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం ఏపీ డిప్యూటి సీఎంగా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ ఫుల్ టైం పొలిటిషియన్ గా మారిపోయాడు. అందులో భాగంగానే సమయం దొరికినప్పుడు మాత్రమే తను సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ ను క్రియేట్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ చిన్నతనంలో చాలా దూకుడుగా ఉండేవాడట.

తను చిన్న తనం లో ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఏదో గొడవ జరిగితే తనతో గొడవ పెట్టుకున్న ముగ్గురిని పవన్ కళ్యాణ్ కొట్టాడట. అది తెలుసుకున్న నాగబాబు అలా కొట్టడం తప్పు అని పవన్ కళ్యాణ్ ని మందలించాడు. ఇక పవన్ కళ్యాణ్ అప్పుడు తెలిసి తెలియని చిన్న పిల్లోడు కాబట్టి మొదట మాటలతో చెప్పారట.

కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అందులో నా తప్పేమీ లేదు అని బలంగా వాదించడంతో నాగబాబు తప్పు ఉన్న లేకపోయినా ఇతరులను కొట్టడం సరైంది కాదు అని రెండు దెబ్బలు కొట్టాడట. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ లో దూకుడు స్వభావం చిన్నప్పటినుంచే ఉంది అంటూ నాగబాబు ఒకానొక సందర్భంలో ఈ విషయాన్ని గుర్తు చేసుకన్నాడు.

ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు సగటు తెలుగు సినిమా ప్రేక్షకులు సైతం చాలా హ్యాపీగా ఫీలయ్యారు. నిజానికి పవన్ కళ్యాణ్ ఏ విషయం మీద అయినా చాలా దూకుడుగా మాట్లాడుతూ ఉంటాడు. ఎవరినైనా సరే నిలదీసి అడగడంలో ఆయనను మించిన వారు మరెవరు లేరు… ఇక అదే వైఖరితో ప్రజల అభిమానాన్ని కొల్లగొడుతూ ముందుకు సాగుతున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version