Devyani Sharma
Devyani Sharma: ఇటీవల కాలం లో బోల్డ్ అనే పదానికి సరికొత్త నిర్వచనం తెలిపినట్టుగా ట్రైలర్ ని చూస్తేనే కళ్ళు , చెవులు మూసుకునే రేంజ్ లో అనిపించిన వెబ్ సిరీస్ ‘సైతాన్’. యాత్ర వంటి సూపర్ హిట్ సినిమాని తీసిన మహి వీ రాఘవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అతి త్వరలోనే ఈ సిరీస్ డిస్నీ + హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతుంది.
ఈ ట్రైలర్ ని చూసిన తర్వాత ప్రతీ ఒక్కరికి అనిపించింది ఏమిటంటే, ఇన్ని రోజులు ఎన్నో బోల్డ్ వెబ్ సిరీస్ మరియు సినిమాలను చూసాము కానీ, ఇంత బోల్డ్ వెబ్ సిరీస్ ని మాత్రం ఇదే మొట్టమొదటి సారి చూడడం అని అంటున్నారు. ముఖ్యంగా ఆడవాళ్లు బూతులు ఈ రేంజ్ లో మాట్లాడడం ఎప్పుడు చూడలేదు. వెబ్ సిరీస్ కంటెంట్ కి సెన్సార్ లేదనే ధైర్యం తో దర్శక నిర్మాతలు ఈమధ్య హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు, అందుకు ఉదాహరణే ఈ ‘సైతాన్’.
ఇక ఈ ట్రైలర్ లో పచ్చి బూతులు మాట్లాడుతూ కనిపించిన ఇద్దరు అమ్మాయిలలో ఒక్కరు దేవయాని శర్మ. ఈమె 2020 వ సంవత్సరం లో భానుమతి రామకృష్ణ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది. ఆ సినిమా ఎప్పుడొచ్చిందో ఎప్పుడు వెళ్లిందో కూడా ఎవరికీ తెలియదు. ఆ తర్వాత పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ హీరో గా నటించిన ‘రొమాంటిక్’ అనే సినిమాలో ఒక పాత్ర పోషించింది.ఆ సినిమా కూడా ఈమెకి అంతగా ఉపయోగపడలేదు, కానీ రీసెంట్ గా డిస్నీ + హాట్ స్టార్ లో విడుదలైన ‘సేవ్ ది టైగర్స్’ అనే వెబ్ సిరీస్ సూపర్ హిట్ అయ్యింది, అందులో దేవయాని పోషించిన పాత్రకి విశేషమైన స్పందన లభించింది.
ఈ సిరీస్ తర్వాత ఆమె దశ మారింది అని చెప్పొచ్చు,వరుసగా సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు చేస్తూ ఫుల్ బిజీ గా మారిపోయింది. ఇక ‘సైతాన్’ వెబ్ సిరీస్ లో ఆమె చాలా బోల్డ్ క్యారక్టర్ చేసింది. ఆమె పాత్రలో బోలెడన్ని షేడ్స్ కూడా ఉన్నాయి అంట, ట్రైలర్ లో చూపించిన బోల్డ్ సన్నివేశాలు కేవలం ఒక్క శాతం మాత్రమే అని, సినిమాలో అంతకు పదింతలు బోల్డ్ సన్నివేశాలు ఉంటాయని చెప్తున్నారు.