https://oktelugu.com/

Gharana Mogudu: ‘ఘరానా మొగుడు’, ‘ఛత్రపతి’ కి ఉన్న సంబంధం ఇదా..? ఇన్నాళ్లు తెలియక..

2005లో వచ్చిన ఛత్రపతి మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీతో ప్రభాస్ కెరీర్ టర్న్ అయందని చెప్పొచ్చు. అటు రాజమౌళికి కూడా ఈ సినిమాతోనే స్టార్ డం వచ్చింది. ఛత్రపతి మూవీ పూర్తిగా తల్లి సెంటిమెంట్ తో నడిచే సినిమా.

Written By:
  • Srinivas
  • , Updated On : September 1, 2023 / 04:54 PM IST

    Gharana Mogudu

    Follow us on

    Gharana Mogudu: నేటి కాలంలో వచ్చే చాలా సినిమాల్లో రీమిక్స్ సాంగ్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఆ కాలంలో హిట్టుకొట్టినవి నేటి కుర్రకారుకు నచ్చే విధంగా రీమేక్ చేస్తున్నారు. అప్పటి సినిమా, ఇప్పటి మ్యూజిక్ డైరెక్టర్లు వేరే అయినా మ్యూజిక్ బాగా ఉండడంతో కొందరు వారికి తెలియకుండా కాపీ కొట్టారు. అయితే కొందరు ఈ విషయాన్ని బయటపెట్టినా పట్టించుకోలేదు. ఎందుకంటే అప్పటి కాలంలో హిట్టుకొట్టిన సాంగ్స్ ఇప్పుడు కొన్ని రీమిక్స్ చేసినా పాపులారిటీ సాధించలేదు. పైగా అలా రీమిక్స్ వాడిన సినిమాలు సక్సెస్ కాలేదు. కానీ అప్పుట్లో వచ్చిన ఘరానా మొడుగు, ఆ తరువాత వచ్చిన ఛత్రపతి సినిమాల్లోని ఓ మ్యూజిక్ ఒకటే ఉంటుంది. పైగా రెండు సినిమాలకు ఒకరే మ్యూజిక్ డైరెక్టర్. ఇంతకీ ఏ మ్యూజిక్ కాపీ కొట్టారంటే?

    1992 లో వచ్చిన ఘరానా మొగుడు సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు నగ్మా నటించారు. కె. రాఘవేంద్రరావు డైరెక్సన్లో వచ్చిన ఈ మూవీ సెన్సేషనల్ హిట్టు కొట్టింది. ఇందులో సాంగ్స్ ఇరగదీశాయి. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అద్భుతమైన బాణీలు అందించారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా ఆకట్టుకుంది. ఘరానా మొగుడు సినిమాలో కూడా తల్లి సెంటిమెంట్ కనిపిస్తుంది. చిరంజీవి తల్లి రావుగోపాల్ రావుకు చెల్లెలు అవుతుంది. ఈ క్రమంలో మ్యూజిక్ బాగా ఆకట్టుకుంటుంది.

    2005లో వచ్చిన ఛత్రపతి మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీతో ప్రభాస్ కెరీర్ టర్న్ అయందని చెప్పొచ్చు. అటు రాజమౌళికి కూడా ఈ సినిమాతోనే స్టార్ డం వచ్చింది. ఛత్రపతి మూవీ పూర్తిగా తల్లి సెంటిమెంట్ తో నడిచే సినిమా. ఓ వైపు సెంటిమెంట్ ను కురిపిస్తూనే..మరోవైపు భారీ యాక్షన్ ఈ మూవీలో కనిపిస్తుంది. దీంతో అన్ని వర్గాల వారికి ఈ సినిమా బాగా నచ్చడంతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

    అయితే ఈ రెండు సినిమాలకు సంబంధం ఉంది. ఈ రెండింటికీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు. సాధారణంగా నేటి కాలంలోని కొందరు మ్యూజిక్ డైరెక్టర్లు పాత సినిమాల్లోని ఇతర మ్యూజిక్ డైరెక్టర్ల మ్యూజిక్ ను కాపీ కొడుతారనే పేరుంది. కానీ ఘరానా మొగుడు, ఛత్రపతికి సినిమాలకూ మ్యూజిక్ అందించిన కీరవాణి తన సినిమాలోనిదే కాపీ కొట్టారట. ఘరానా మొగుడు సినిమాలోని చిరంజీవి, నగ్మా ల మధ్య వచ్చే మ్యూజిక్, ఛత్రపతి సినిమాలో ప్రభాస్ నడుచుకుంటూ వస్తుండగా వస్తుంది. ఈరెండు సేమ్ అనే విషయాన్ని చాలా మంది గుర్తించలేదు. కానీ దీనిని అందులోనుంచి తీసుకున్నారని టాక్.