https://oktelugu.com/

Manchu Lakshmi: విష్ణుకు రాఖీ కట్టని మంచు లక్ష్మి… మనోజ్ తో మాత్రం లంచ్ పార్టీ!

తాజాగా రాఖీ పండుగ సందర్భంగా మంచు లక్ష్మి తన రాముడు మనోజ్ కు రాఖీ కట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మంచు మనోజ్, ఆయన భార్య భూమా మౌనిక, బావమరిది జగత్ విఖ్యాత్ రెడ్డి లతో కలిసి మంచు లక్ష్మి లంచ్ చేసిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాయి.

Written By:
  • Shiva
  • , Updated On : September 1, 2023 / 05:07 PM IST

    Manchu Lakshmi

    Follow us on

    Manchu Lakshmi: టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీ అంటే ఒకప్పుడు మంచి పేరు ఉండేది. ఒక వైపు మోహన్ బాబు, మరోవైపు ఆయన ఇద్దరు కొడుకులు హీరోలుగా నటిస్తూ తమ దూకుడు చూపించారు. కానీ ఆ దూకుడు ఎక్కువ రోజులు కొనసాగించలేక పోటీలో వెనకపడ్డారు. దీనికి తోడు పబ్లిక్ లో మంచు ఫ్యామిలీ చేసే పనులు వలన కావచ్చు చెప్పే మాటల వలన కావచ్చు ట్రోల్ల్స్ కు గురవుతూ ఉంటారు. ఇదే సమయంలో మంచు బ్రదర్స్ మధ్య కూడా విభేదాలు ఉన్నట్లు బయటకు వచ్చింది.

    తాజాగా రాఖీ పండుగ సందర్భంగా మంచు లక్ష్మి తన రాముడు మనోజ్ కు రాఖీ కట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మంచు మనోజ్, ఆయన భార్య భూమా మౌనిక, బావమరిది జగత్ విఖ్యాత్ రెడ్డి లతో కలిసి మంచు లక్ష్మి లంచ్ చేసిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాయి. ఇందులో మంచు విష్ణు మాత్రం మిస్ అయ్యారు . రాఖీ రోజు కేవలం మంచు మనోజ్ ఫోటోలు పెట్టి, విష్ణు ఫోటోలు పెట్టకపోవడంతో అది కాస్తా వైరల్ అవుతుంది.

    నిజానికి గత కొద్ది రోజుల నుంచి మంచు బ్రదర్స్ కి గొడవలు జరుగుతున్నాయి. మనోజ్ రెండో పెళ్లి విషయంలో విష్ణు, మోహన్ బాబు అంటీముట్టనట్లు దూరంగా ఉండటంతో మంచు లక్ష్మి అన్ని బాధ్యతలు తీసుకోని మనోజ్ పెళ్లి చేసింది. ఆ తర్వాత మనోజ్ మనిషిని విష్ణు కొట్టడం, దానిని మనోజ్ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వాళ్ళ మధ్య ఏదో పంచాయతీ నడుస్తుందని కంఫర్మ్ అయ్యింది. ఆ తర్వాత మోహన్ బాబు రిజిస్టర్ ఆఫీస్ కి రావడం, అక్కడ మీడియా కనిపించగానే బూతులు తిడుతూ మీడియా మీద ఫైర్ అయ్యారు మోహన్ బాబు.

    అప్పట్లో ఆస్తి పంపకాల విషయం మీద మోహన్ బాబు రిజిస్టర్ ఆఫీస్ కి వచ్చినట్లు తెలుస్తుంది. మనోజ్ కి మద్దతుగా మంచు లక్ష్మి నిలబడితే, విష్ణు కు మద్దతుగా మోహన్ బాబు ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా రాఖీ రోజున విష్ణు ఫోటోలు లేకపోవటంతో విష్ణు ను మనోజ్, లక్ష్మి దూరం పెట్టారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. దీనిపై మరో రకమైన వాదన కూడా వినిపిస్తోంది. రీసెంట్ గా కన్నప్ప అనే సినిమా ను స్టార్ట్ చేసిన మంచు విష్ణు ఆ సినిమా పనుల మీద ఫారిన్ వెళ్లటంతో రాఖీ రోజున అందుబాటులో లేదు. అంతే తప్ప లక్ష్మి కి విష్ణు కి ఎలాంటి గొడవలు లేవని మరికొందరి వాదన.