Hero Vijay: ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్న విజయ్… పదివేల వాట్సప్ గ్రూప్స్ టార్గెట్!

ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత లాంటి వాళ్ళు సినీ రంగం నుంచి వచ్చిన వాళ్లు. ఇప్పుడు ఇదే వరసలో తమిళ స్టార్ హీరో విజయ్ రాబోతున్నాడు. విజయ్ కి రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న విషయం అందరికి తెలిసిందే.

Written By: Shiva, Updated On : September 1, 2023 4:43 pm

Hero Vijay

Follow us on

Hero Vijay: సినిమా స్టార్స్ రాజకీయాల్లోకి రావడం మనకి కొత్తేమి కాదు. తమిళనాడు లో కావచ్చు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు సినీ రంగంలో ఒక వెలుగు వెలిగిన నటి నటులు రాజకీయ చదరంగంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని వాళ్ళు ఎక్కువ అని చెప్పాలి. అయితే తెలుగులో తారక రామారావు తర్వాత ఆ స్థాయిలో సక్సెస్ అయిన సినీనటుడు లేరనే చెప్పాలి.మధ్యలో చిరంజీవి వచ్చిన కానీ సక్సెస్ కాలేదు. ఇక పక్కనే ఉన్న తమిళనాడు లో ఈ సంప్రదాయం ఎప్పటి నుండో ఉంది.

ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత లాంటి వాళ్ళు సినీ రంగం నుంచి వచ్చిన వాళ్లు. ఇప్పుడు ఇదే వరసలో తమిళ స్టార్ హీరో విజయ్ రాబోతున్నాడు. విజయ్ కి రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న విషయం అందరికి తెలిసిందే. త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది. అందుకు సంబంధించిన పనులన్నీ తెరవెనుక వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం తమిళనాడులో రాజకీయంగా ఎదగడానికి మంచి అవకాశం ఉంది, దానిని అందిపుచ్చుకోవడానికి విజయ్ ఉత్సాహం చూపిస్తున్నారు.

ఇప్పటికే దీనికి సంబంధించి విజయ్ ఫ్యాన్స్ కు సృష్టమైన ఆదేశాలు వెళ్లాయి. రీసెంట్ గా విజయ్ ప్రజా సంఘాల నేత బుస్షి ఆనంద్ నేతృత్వంలో స్థానిక పనైయార్ లోని విజయ్ అభిమాన సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి రాష్ట్రంలో 24 పార్లమెంట్ స్థానాల్లోని పలువురు సంఘ నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో సోషల్ మీడియా ను ఉపయోగించుకుని ప్రజలకు ఎలా చేరువ అవ్వాలనే దానిపై చర్చలు జరిపారు.

ఇందులో భాగంగా దాదాపు 1600 వాట్సాప్ గ్రూప్ లను క్రియేట్ చేశారు. వాటిని పదివేలు గ్రూప్స్ వరకు తీసుకొని పోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇలా అన్ని రకాలుగా సోషల్ మీడియా ను తమ హీరో రాజకీయ ఎదుగుదలకు ఉపయోగించుకోవాలని సంఘ నేతలు నిర్ణయం తీసుకున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల సమయానికి అన్ని చోట్ల కాకపోయిన తమకు బలమున్న కొన్ని స్థానాల్లో పోటీ చేస్తే బాగుంటుందని విజయ్ అభిమాన సంఘం నేతలు అభిప్రాయపడుతున్నారు. మరోపక్క లియో సినిమా తర్వాత విజయ్ తమిళనాడు వ్యాప్తంగా పాదయాత్ర మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.