Demon Pawan Bigg Boss 9 : బిగ్ బాస్ రియాలిటీ షో సెలబ్రిటీలకు సరికొత్త జీవితాన్ని ఇస్తుందని అందరూ అంటుంటారు. కానీ ఫ్లాష్ బ్యాక్ కి వెళ్లి చూస్తే, సదరు సెలబ్రిటీలు అంతకు ముందు ఎలా ఉన్నారో, ఇప్పటికీ అలాగే ఉన్నారనే విషయం అర్థం అవ్వుధి. కేవలం శివాజీ ఒక్కడే బిగ్ బాస్ అవకాశాన్ని సరైన రీతిలో ఉపయోగించుకొని, ఇప్పుడు ఇండస్ట్రీ లో మోస్ట్ డిమాండ్ ఉన్న ఆర్టిస్టు గా కొనసాగుతున్నాడు. ఆయన తర్వాత మానస్ కూడా టీవీ సీరియల్స్ తో ఫుల్ బిజీ గా గడుపుతున్నాడు. మిగిలిన సెలబ్రిటీలు ఎక్కడ ఉన్నారో ఏమి చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి. కానీ శివాజీ లాగానే, మరో బిగ్ బాస్ సెలబ్రిటీ కూడా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి సక్సెస్ సాధించబోతున్నాడా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఆ బిగ్ బాస్ సెలబ్రిటీ మరెవరో కాదు, డిమోన్ పవన్.
ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లోకి ‘అగ్నిపరీక్ష’ అనే షో ద్వారా సామాన్యుడిగా హౌస్ లోకి అడుగుపెట్టిన ఆయన, మొదటి వారం నుండే టాస్కులు అద్భుతంగా ఆడుతూ తన సత్తా చాటుతూ వచ్చాడు. హౌస్ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లోనే రెండు సార్లు కెప్టెన్ అయ్యాడు. రీతూ తో లవ్ ట్రాక్ కారణంగా ఆయన టైటిల్ గెలవలేకపోయాడు కానీ, చివరి మూడు వారాలు ఉన్నట్లు గా మొదటి వారం నుండి ఉండుంటే, కచ్చితంగా టైటిల్ గెలిచేవాడని అంతా అంటున్నారు. అయినప్పటికీ కూడా చివరి మూడు వారాల్లో డిమోన్ పవన్ విశ్వరూపం చూసి, ఆడియన్స్ ఆయన్ని టాప్ 3 స్థానం లో కూర్చోబెట్టారు. అంతే కాకుండా 15 లక్షల రూపాయిల సూట్ కేసు ని కూడా తీసుకొచ్చాడు. అయితే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన వెంటనే డిమోన్ పవన్ కి ఆఫర్లు వెల్లువ లాగా కురుస్తున్నాయట.
సినిమాలు, రియాలిటీ షోస్, వెబ్ సిరీస్, సీరియల్స్ ఇలా ఒక్కటా రెండా, ఎన్నో ఆఫర్లు వస్తున్నాయట. ఏది ఎంచుకోవాలో తెలియక అయ్యోమయ్యం స్థితిలో ప్రస్తుతం డిమోన్ పవన్ ఉన్నట్టు తెలుస్తోంది. డిమోన్ పవన్ డ్యాన్స్ లో అదరగొడుతాడు కాబట్టి, ఈ శనివారం నుండి మొదలయ్యే ‘BB జోడి 2’ లో రీతూ చౌదరి తో కలిసి ఒక కంటెస్టెంట్ గా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా రాబోతున్నాడట. ఈ కాంట్రాక్టు దాదాపుగా ఖరారు అయ్యినట్టు తెలుస్తోంది. అదే విధంగా ఒక వెబ్ సిరీస్ లో నటించడానికి కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక చేతినిండా సినిమాలు, వెబ్ సిరీస్ లు, ఈవెంట్ల తో డిమోన్ పవన్ ఫుల్ బిజీ గా మారబోతున్నాడు. రాబోయే రోజుల్లో ఆయన ఇంకా ఏ రేంజ్ కి వేళ్తాడో చూడాలి.