Homeఎంటర్టైన్మెంట్Suhas insulted by senior heroine: ఒక పెద్ద హీరోయిన్ పిలిచి మరీ నన్ను అవమానించింది...

Suhas insulted by senior heroine: ఒక పెద్ద హీరోయిన్ పిలిచి మరీ నన్ను అవమానించింది అంటూ ఎమోషనల్ అయిన హీరో సుహాస్!

Suhas insulted by senior heroine: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి ఈమధ్య కాలంలో అడుగుపెట్టిన వారిలో ఒకరు సుహాస్(Actor Suhas). యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ, తద్వారా సినిమాల్లోకి కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సుహాస్, ఆ తర్వాత హీరో గా మారి ఎన్నో వైవిధ్య భరితమైన సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. హీరో గా వరుసగా విజయాలను అందుకుంటూ ముందుకు […]

Suhas insulted by senior heroine: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి ఈమధ్య కాలంలో అడుగుపెట్టిన వారిలో ఒకరు సుహాస్(Actor Suhas). యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ, తద్వారా సినిమాల్లోకి కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సుహాస్, ఆ తర్వాత హీరో గా మారి ఎన్నో వైవిధ్య భరితమైన సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. హీరో గా వరుసగా విజయాలను అందుకుంటూ ముందుకు వెళ్తున్న సుహాస్, ఇప్పుడు లేటెస్ట్ గా ‘హే బల్వంత్’ అనే చిత్రం తో మన ముందుకు రాబోతున్నాడు. ముందుగా ఈ చిత్రానికి ‘హే భగవాన్’ అని పేరు పెట్టారు. థియేట్రికల్ ట్రైలర్ ని కూడా ఆ పేరుతోనే రిలీజ్ చేశారు. కానీ సెన్సార్ పూర్తి అయ్యాక, సెన్సార్ సభ్యులు ‘హే భగవాన్’ టైటిల్ కి అభ్యంతరం వ్యక్తం చేయడం తో, మూవీ టీం ‘హే బల్వంత్’ గా టైటిల్ ని మార్చారు.

ఈ సినిమా ఈ నెల 20న విడుదల అవ్వబోతున్న సందర్భంగా నిన్న హైదరాబాద్ లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు మేకర్స్. ఈ ఈవెంట్ లో సుహాస్ మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘ఒకప్పుడు ఒక పెద్ద హీరోయిన్ పక్కన మంచి నిడివి ఉన్న క్యారెక్టర్ ఉందని, నన్ను చేయాల్సిందిగా ఆ సినిమా షూటింగ్ కి పిలిచారు. అక్కడికి వెళ్ళగానే ఆ టాప్ హీరోయిన్ ‘ఈయనెవరో..ఇతన్ని ఎందుకు ఇక్కడికి పిలిచారు’ అని నా మొహం మీదనే అనేసింది. నవ్వేసి అక్కడి నుండి బయటకు వచ్చేశా. కట్ చేస్తే కీర్తి సురేష్ లాంటి టాప్ మోస్ట్ హీరోయిన్ తో కలిసి ‘ఉప్పు కప్పురంబు’ వంటి సినిమా చేశాను. సెట్స్ లోకి వచ్చిన మొదటి రోజు ఆమె నన్ను హత్తుకున్నారు. ఆవిడకు ఎన్నో సార్లు మా ఇంటి భోజనం కూడా తినిపించాను. ఒక స్టార్ హీరోయిన్ తో ఈరోజు నేను చనువుగా మాట్లాడగలుగుతున్నాను. ఈ స్థాయికి ఎదిగినందుకు , నా దృష్టిలో ఇది విజయమే’ అంటూ చెప్పుకొచ్చాడు సుహాస్.

ఇంతకీ ఆయన్ని అంతలా అవమానించిన ఆ హీరోయిన్ ఎవరు?, ఎందుకు అలా చేసింది అనేది మాత్రం బయటకు రాలేదు. అయితే పెద్దగా అందంగా లేకపోయినా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ని ప్రారంభించి, ఈరోజు ఇంత పెద్ద రేంజ్ కి ఎదగడం అంటే సాధారణమైన విషయం కాదు. సుహాస్ సినిమా వస్తుంది అంటే, కచ్చితంగా ఎదో కోతరకమైన సినిమా అయ్యుంటుంది , థియేటర్ లో చూడాల్సిందే అనే రేంజ్ ఆడియన్స్ ని ఆయన లక్షల్లోనే సంపాదించుకున్నాడు. రాబోయే రోజుల్లో ఇంకా ఎంత పెద్ద రేంజ్ కి వెళ్తాడు అనేది చూడాలి.

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper