Trisha legal notice Nainar Nagendran: ప్రముఖ తమిళ హీరో విజయ్(Thalapathy Vijay) గత కొంత కాలం నుండి స్టార్ హీరోయిన్ త్రిష(Trisha Krishnan) తో ప్రేమాయణం నడుపుతున్నాడని, వీళ్లిద్దరు లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతూనే ఉంది. ఇప్పుడు విజయ్ రాజకీయాల్లో ఉండడం తో, ప్రత్యర్థులు ఆయన్ని విమర్శించడానికి ఈ రూమర్ ని వాడుకుంటున్నారు. రీసెంట్ గానే బీజేపీ నాయకుడు నైనర్ నాగేంద్రన్ విజయ్ ని విమర్శిస్తూ ‘విజయ్ కి రాజకీయ పరిజ్ఞానం చాలా తక్కువ. ముందు ఆయన్ని అతని ఇంటి నుండి బయటకు వచ్చి ప్రజల కష్టాలను చూడమని చెప్పండి. అలాగే త్రిష ఇంటి నుండి ఆయన బయటకు రావాల్సిన అవసరం ఉంది’ అంటూ చాలా ఘాటు కామెంట్స్ చేశాడు. ఈ కామెంట్స్ పై మొన్న త్రిష కూడా ట్విట్టర్ వేదికగా చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
కౌంటర్ అంటే అలాంటి ఇలాంటి కౌంటర్ కాదు, ఏకంగా తన న్యాయవాది నిథయేశ్ నటరాజ్ తో ఒక లీగల్ నోటీసు ని జారీ చేసింది. రాజకీయంగా ఉన్నత స్థాయిలో ఉన్న ఆ వ్యక్తి నుండి, మా క్లయింట్ త్రిష ఇలాంటి వ్యాఖ్యలు అసలు ఊహించలేదని, మా క్లయింట్ ఏ రాజకీయ పార్టీ కి చెందిన వ్యక్తి కాదని, ఆమె చాలా న్యూట్రల్ గా ఉండే అమ్మాయి అని, అనవసరం గా ఆమెకు లేని పోనీ లింకులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఈ నోటీసు ని సోషల్ మీడియా లో అప్లోడ్ చేసి రెండు రోజులు అవుతున్నప్పటికీ కూడా, నైనర్ నాగేంద్రన్ నుండి ఎలాంటి రియాక్షన్ రాలేదు. అభిమానులు అతని నుండి క్షమాపణలు ఆశించారు. కానీ కనీసం రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. దీంతో లీగల్ గా త్రిష నైనర్ నాగేంద్రన్ పై పరువు నష్టం దావా వెయ్యడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.
అసభ్యంగా, సభ్య సమాజం సిగ్గు పడేలా మాట్లాడే ఇలాంటి వాళ్ళు న్యాయపరమైన చర్యలను అనుభవించడానికి అర్హులు అని ఆమె నిర్ణయించుకుందట. రేపు ఆమె మద్రాసు హైకోర్టు లో నైనర్ నాగేంద్రన్ పై పరువు నష్టం కేసు వేసే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఇప్పటికైనా ఆయన రెస్పాన్స్ ఇస్తాడో లేదో చూడాలి. సినీ ఇండస్ట్రీ కి చెందిన వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే, ప్రత్యర్థులు ఇలా వారిపై లేనిపోని లింకులు పెట్టడం సర్వ సాధారణం అయిపోయింది. ఇది చిరంజీవి , పవన్ కళ్యాణ్ వంటి వారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మనమంతా చూసే ఉన్నాము. ఇప్పుడు విజయ్ కి కూడా తమిళనాడు లో అదే జరుగుతోంది. ఇలాంటి విమర్శలను విజయ్ ఎలా తిప్పి కొడుతాడో రాబోయే రోజుల్లో చూడాలి.
Disrespect should and always will be called out. pic.twitter.com/FmXdIBvAJ6
— Trish (@trishtrashers) February 16, 2026