Bigg Boss 8 Telugu: భార్యకు భయపడి బిగ్ బాస్ 8 ఆఫర్ వదులుకున్న స్టార్… ఇదెక్కడి మాస్ రా మామ!

బిగ్ బాస్ షోలో కంటెస్ట్ చేయాలని చాలా మంది సెలెబ్స్ ఆశపడుతుంటారు. తక్కువ సమయంలో డబ్బుతో పాటు ఫేమ్ కూడా రాబట్టొచ్చని కలలు కంటుంటారు. కానీ ఆ అవకాశం అందరికీ దక్కదు. కాగా బిగ్ బాస్ టీం ఏరికోరి అవకాశం ఇస్తే ఓ నటుడు వద్దు బాబోయ్ అంటున్నాడట. ఆ హీరో భార్య వద్దని చెప్పడంతో ఆఫర్ రిజెక్ట్ చేశాడట. ఇంతకీ ఆ సెలెబ్రెటీ ఎవరు? అతని భార్య ఎందుకు నిరాకరించింది?

Written By: S Reddy, Updated On : August 22, 2024 4:15 pm

Bigg Boss 8 Telugu

Follow us on

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ లాంచ్ ఈవెంట్ సెప్టెంబర్ 1న జరగనుంది. అఫీషియల్ ప్రకటన కూడా రావడంతో బిగ్ బాస్ లవర్స్ ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. ఈ క్రమంలో కొందరు కంటెస్టెంట్స్ పేర్లు జోరుగా వినిపిస్తున్నాయి. రీతూ చౌదరి, విష్ణు ప్రియ, నటుడు ఖయూమ్, యాష్మి గౌడ, బంచిక్ బబ్లు, తేజస్విని గౌడ, అక్షిత, నటి సన, బెజవాడ బెబక్క, సింగర్ సాకేత్, జబర్దస్త్ పవిత్ర, నిఖిల్ లేటెస్ట్ సీజన్ లో కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇవ్వనున్నారట.

సీరియల్ నటుడు మొగలిరేకులు ఫేమ్ ఇంద్రనీల్ కూడా సీజన్ 8 లో పార్టిసిపేట్ చేయబోతున్నాడని, చాలా రోజులుగా వినిపిస్తోంది. ఈ క్రమంలో అతని ఫైనల్ ఇంటర్వ్యూ కూడా పూర్తయిందని తెలుస్తుంది. ఇంద్రనీల్ బిగ్ బాస్ 8 కి సెలెక్ట్ అయ్యారట. కానీ అగ్రిమెంట్ చేయలేదు. దీనికి కారణం ఇంద్రనీల్ భార్య అని తెలుస్తుంది. బిగ్ బాస్ కి వెళ్ళడానికి వీల్లేదని ఇంద్రనీల్ భార్య కచ్చితంగా చెప్పేసిందట. ఎందుకంటే బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా సెలెబ్రెటీలు గుర్తింపు తెచ్చుకుని కెరీర్ లో ఎదిగిన వారు కొందరైతే.

ఉన్న పేరు బద్నాం అయ్యి బిగ్ బాస్ ఆటకు బలైన వాళ్ళు చాలా మందే ఉన్నారు. ప్రతి సీజన్లో ఒకరిద్దరిని టార్గెట్ చేసి వారిని ఎంత నెగిటివ్ చెయ్యాలో అంత నెగటివ్ చేసి పారేస్తాడు బిగ్ బాస్. ఏదో చెయ్యాలని హౌస్ లోకి వెళ్లి ఇంకేదో అయ్యి వస్తారు. లోపల ఎంత మంచిగా ఉన్నా బిగ్ బాస్ మాత్రం తనకు కావలసిన కంటెంట్ మాత్రమే ఎడిట్ చేసి చూపిస్తాడు. ఇంద్రనీల్ కి బుల్లితెర ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి పేరుంది. ఆదరణ ఉంది. ఆ పేరు పోకూడని భావించిన భార్య మేఘన వద్దని చెప్పారట.

పైగా బయట సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఈ బిగ్ బాస్ ఫ్యాన్స్ కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా లాగి నోటికొచ్చినట్టుగా తిడుతుంటారు. సోషల్ మీడియా వేధింపులకు పాల్పడతారు. గత సీజన్లో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్ దీప్ విషయంలో ఎంత క్రూరంగా ప్రవర్తించారో తెలిసిందే. అమర్ కారు పై దాడి చేశారు. అతని కుటుంబాన్ని కూడా ఇబ్బందులకు గురి చేశారు. ఇవన్నీ చూసి భయపడి ఇంద్రనీల్ బిగ్ బాస్ కి వెళ్లకూడదని మేఘన అడ్డుకుంటున్నారట. బిగ్ బాస్ రివ్యూవర్ అయిన స్పై అక్క ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది.