Indra re Release : లండన్ లో ప్రభంజనం సృష్టించిన ‘ఇంద్ర’.. రీ రిలీజ్ చిత్రాలలో విడుదలకు ముందే ఆల్ టైం రికార్డు!

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలలో మొదలయ్యాయి. నార్త్ అమెరికా లో కాసేపటి క్రితమే బుకింగ్స్ ప్రారంభం అయ్యింది. నైజాం ప్రాంతం లో ఈ సినిమాకి కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 50 లక్షలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

Written By: Vicky, Updated On : August 18, 2024 10:14 pm

Indhra Movie Re Release

Follow us on

Indra re Release : మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్స్ ఉండొచ్చు. కానీ వాటిల్లో ఇంద్ర సినిమా ఎంతో ప్రత్యేకం. ఫ్యాక్షన్ జానర్ నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి, కానీ ఇంద్ర సినిమా సృష్టించిన ప్రభంజనం ఇప్పటికీ ఎవ్వరూ మర్చిపోలేరు. అత్యధిక రిపీట్ విలువ ఉన్న ఈ చిత్రం రీసెంట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ చేస్తే రికార్డు స్థాయి టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. చిరంజీవి కొత్త సినిమాలకు కూడా ఈమధ్య కాలం లో ఈ స్థాయి టీఆర్ఫీ రేటింగ్స్ రాకపోవడం గమనార్హం. జీ తెలుగు ఛానల్ లో ప్రసారమైన ఈ సినిమాకి దాదాపు 7 రేటింగ్స్ వచ్చాయి. టీవీ లో సెన్సేషన్ సృష్టించిన ఈ సినిమా, ఇప్పుడు థియేటర్స్ లో మరోసారి ప్రభంజనం సృష్టించడానికి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజైన ఆగష్టు 22 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలలో మొదలయ్యాయి. నార్త్ అమెరికా లో కాసేపటి క్రితమే బుకింగ్స్ ప్రారంభం అయ్యింది. నైజాం ప్రాంతం లో ఈ సినిమాకి కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 50 లక్షలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది సాధారణమైన విషయం కాదు, సీనియర్ హీరోలలో ఇప్పటి వరకు ఇలాంటి రికార్డు ఎవరికీ లేదు. అలాగే లండన్ లో ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ లో టికెట్స్ హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోయాయి. రీసెంట్ గా విడుదలైన సూపర్ స్టార్ మహేష్ బాబు మురారి చిత్రానికి లండన్ లో క్లోసింగ్ దాదాపుగా 13 వేల యూరోలు వచ్చాయి . కానీ ఇంద్ర సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించిన రోజే 11 వేల యూరోలు వచ్చాయి. ఈ ప్రాంతం లో ఇంద్ర ఫుల్ రన్ లో 30 వేలకు పైగా యూరోలు వసూలు ట్రిపుల్ మార్జిన్ తో అల్ టైం రికార్డు పెట్టే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. సాధారణంగా విదేశాల్లో వీకెండ్స్ మాత్రమే జనాలు సినిమాలు చూసేందుకు ఇష్టపడుతారు. ఎందుకంటే అక్కడ ఉండేది మొత్తం ఉద్యోగం చేసేవాళ్ళు, అలాగే చదువుకునే వాళ్ళు కాబట్టి.

కానీ ఇంద్ర వీకెండ్ లో విడుదల కానప్పటికీ కూడా ఈ స్థాయి వసూళ్లు వచ్చాయంటే వింటేజ్ మెగాస్టార్ చిరంజీవి అంటే జనాల్లో ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తుంటే, ఇంద్ర చిత్రం మొదటి రోజు 3 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంటున్నారు. అంతే కాకుండా వీకెండ్ ముగిసేవరకు ఈ సినిమాకి వసూళ్ల వర్షం కురుస్తూనే ఉంటుందని, కొత్త సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి కాబట్టి ఆడియన్స్ ఇంద్ర సినిమాని చూసేందుకు ఎగబడే అవకాశాలు ఉన్నాయని, క్లోసింగ్ లో ఓవరాల్ గా ఆల్ టైం రికార్డు పెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.