https://oktelugu.com/

Saripodha Shanivaram : సరిపోదా శనివారం’ చిత్రంలో నాని సెకండ్ హీరోనా..? ఆడియన్స్ కి ఫ్యూజులు ఎగిరే ట్విస్ట్..మరి మొదటి హీరో ఎవరు!

సరిపోదా శనివారం సినిమాలో నేను ఫస్ట్ హీరో కాదు, ఎస్ జె సూర్య గారు ఫస్ట్ హీరో, నేను సెకండ్ హీరో. కథకి తగ్గట్టుగా ఈ సినిమాకి 'సూర్యాస్ సాటర్డే' అని పేరు పెట్టాము కానీ, ఇది సూర్య గారి సినిమానే' అంటూ చెప్పుకొచ్చాడు హీరో నాని. అంటే నాని ఈ చిత్రం లో వారం లో అన్నీ రోజులు ఒకలాగా ఉంటాడు.

Written By:
  • Vicky
  • , Updated On : August 18, 2024 / 10:07 PM IST

    Saripodha Shanivaram

    Follow us on

    Saripodha Shanivaram  :ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఒక బలమైన బ్లాక్ బస్టర్ హిట్ కావాలి. ఇటీవల విడుదలైన కొత్త సినిమాలన్నీ ఒక దానిని మించి ఒకటి డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఆడియన్స్ థియేటర్స్ లో చూసేందుకు సరైన ఛాయస్ లేకుండా పోయింది. ఇలాంటి సమయం లో స్టార్ హీరోల పాత సినిమాలు రీ రిలీజ్ అవుతూ థియేటర్స్ కి ఊపిరి పోస్తున్నాయి. ఇప్పుడు ట్రేడ్ చూపు మొత్తం న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘సరిపోదా శనివారం’ చిత్రంపైనే ఉన్నాయి. వివేకా ఆత్రేయ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా పై ప్రారంభ దశ నుండే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇక ప్రమోషనల్ కంటెంట్ ఒక్కొక్కటి బయటకి వచ్చిన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. పాటలు , టీజర్, ట్రైలర్ ఇలా ప్రతీ ఒక్కటి అభిమానుల్లో ప్రేక్షకుల్లో అమితాసక్తిని రేపాయి.

    ఈ సినిమా ప్రొమోషన్స్ లో హీరో నాని తో పాటు విలన్ గా నటించిన ఎస్ జె సూర్య, హీరోయిన్ గా నటించిన ప్రియాంక మోహన్ కూడా పాల్గొంటున్నారు. రీసెంట్ గా ఈ టీం ఇచ్చిన ఇంటర్వ్యూ లో నాని మాట్లాడిన కొన్ని ఆసక్తికరమైన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘అందరూ అనుకుంటున్నట్టు ఈ సినిమాలో నేను ఫస్ట్ హీరో కాదు, ఎస్ జె సూర్య గారు ఫస్ట్ హీరో, నేను సెకండ్ హీరో. కథకి తగ్గట్టుగా ఈ సినిమాకి ‘సూర్యాస్ సాటర్డే’ అని పేరు పెట్టాము కానీ, ఇది సూర్య గారి సినిమానే’ అంటూ చెప్పుకొచ్చాడు హీరో నాని. అంటే నాని ఈ చిత్రం లో వారం లో అన్నీ రోజులు ఒకలాగా ఉంటాడు. శనివారం రోజు మాత్రం వేరేలా ఉంటాడు. తన అమ్మకి ఇచ్చిన మాట కోసం తనలో ఉన్న విపరీతమైన కోపాన్ని అణుచుకొని కేవలం శనివారం మాత్రమే ఆ కోపాన్ని చూపిస్తాడు. కానీ ఈ సినిమాలో విలన్ గా నటించిన ఎస్ జె సూర్య మాత్రం ప్రతీ రోజు హీరోని డామినేట్ చేసే విధంగానే ఉంటాడు. అందుకే నాని ఆ ఉద్దేశ్యంతో ఈ సినిమాలో మొదటి హీరో ఎస్ జె సూర్య అని చెప్పి ఉండొచ్చు అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో ప్రారంభమై చాలా రోజులు అయ్యింది. అక్కడి ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం ఈ సినిమాకి ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 50 వేల డాలర్లు వచ్చాయట. ఇదే ఊపుని రాబొయ్యే రోజుల్లో కొనసాగిస్తే ఈ చిత్రానికి కేవలం నార్త్ అమెరికా నుండే 7 లక్షల డాలర్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇప్పటి వరకు ఇలాంటి వసూళ్లు కేవలం స్టార్ హీరోలకు మాత్రమే వచ్చింది. ఇప్పుడు నాని కి కూడా వస్తున్నాయి అంటే ఆయన స్టార్ లీగ్ లోకి అధికారికంగా అడుగుపెట్టినట్టే అనుకోవాలి.