https://oktelugu.com/

Shraddha Kapoor : బాక్సాఫీస్ దున్నేస్తున్న ప్రభాస్ హీరోయిన్… బడా స్టార్స్ కి షాక్ ఇస్తూ వందల కోట్ల వసూళ్లు!

చిన్న చిత్రం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది. శ్రద్దా కపూర్-రాజ్ కుమార్ రావ్ జంటగా నటించిన స్ట్రీ 2 ప్రేక్షకాదరణ పొందుతుంది. అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం చిత్రాలకు ఝలక్ ఇస్తూ స్ట్రీ 2 వసూళ్ళలో జోరు చూపిస్తుంది.

Written By:
  • S Reddy
  • , Updated On : August 18, 2024 / 10:24 PM IST

    Stree 2 movie

    Follow us on

    Shraddha Kapoor ; శ్రద్దా కపూర్ సాహో చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. 2019లో విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ హిందీలో సూపర్ హిట్. రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. సాహో అనంతరం శ్రద్దా కపూర్ కి ఆ రేంజ్ హిట్ పడలేదు. ఆమె కెరీర్ కూడా ఏమంత ఆశాజనకంగా లేదు. ఈ క్రమంలో స్ట్రీ 2 రూపంలో హిట్ పడింది. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న స్ట్రీ 2 విడుదల చేశారు. స్ట్రీ 2 చిత్రానికి పోటీగా అక్షయ్ కుమార్ నటించిన ఖేల్ ఖేల్ మే, జాన్ అబ్రహం వేద విడుదలయ్యాయి. బడా స్టార్స్ చిత్రాలను వెనక్కి నెడుతూ స్ట్రీ 2 బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది.

    2018లో వచ్చిన సక్సెస్ ఫుల్ హారర్ కామెడీ చిత్రం స్ట్రీ కి ఇది సీక్వెల్. శ్రద్దా కపూర్-రాజ్ కుమార్ రావ్ నటించారు. అభిషేక్ బెనర్జీ, ఖురానా, పంకజ్ త్రిపాఠి కీలక రోల్స్ చేశారు. తమన్నా ప్రత్యేక పాత్రలో మెరిసింది. స్ట్రీ 2 చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకుడు. దినేష్ విజన్, జ్యోతి దేశ్ పాండే నిర్మించారు. సచిన్-జిగర్, జస్టిన్ వర్గీస్ మ్యూజిక్ అందించారు. మ్యాడ్ డాక్ హారర్ ఫిలిమ్స్ యూనివర్స్ లో భాగంగా స్ట్రీ తెరకెక్కింది. భేడియా, ముంజ్యా ఈ హారర్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన చిత్రాలు.

    స్ట్రీ 2 మొదటి షో నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఓపెనింగ్స్ అదే స్థాయిలో ఉన్నాయి. స్ట్రీ 2 బడ్జెట్ రూ . 50 కోట్లు. అయితే మూడు రోజుల్లోనే దాదాపు మూడు రెట్లు వసూళ్లు రాబట్టింది. స్ట్రీ 2 మూడు రోజుల్లో రూ. 137 కోట్లు రాబట్టినట్లు సమాచారం. ఆదివారం వీకెండ్ కాగా, సోమవారం రాఖీ పౌర్ణమి. లాంగ్ వీకెండ్ లో విడుదలైన స్ట్రీ 2 రానున్న రెండు రోజుల్లో మరిన్ని వసూళ్ళు రాబట్టనుంది. వసూళ్లు ఇంకా మెరుగ్గా ఉండే అవకాశం కలదు.

    సినిమాకు రాజ్ కుమార్ రావ్ నటన ప్రధాన బలంగా నిలిచింది. ఆయన కామెడీ టైమింగ్ ఆడియన్స్ తో నవ్వులు పూయిస్తోంది. హారర్, కామెడీ, సస్పెన్సు అంశాలు పర్ఫెక్ట్ గా కుదిరాయి. ఆద్యంతం ఆసక్తికరంగా స్ట్రీ 2 సాగుతుంది. శ్రద్దా కపూర్ మిస్టీరియస్ రోల్ లో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది. సపోర్టింగ్ క్యాస్ట్ సహజ నటనతో ఆకట్టుకున్నారు. ఇక తమన్నా స్పెషల్ అప్పీరెన్స్ సినిమాకు మరో హైలెట్. స్ట్రీ 2 బాలీవుడ్ కి మంచి బూస్ట్ ఇచ్చింది.

    ఇక స్ట్రీ మూవీ కథ విషయానికి వస్తే… పురుషులను భయభ్రాంతులను స్ట్రీ పీడ విరగడంతో చండేలీ గ్రామ ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. కొన్నేళ్ల తర్వాత సర్కత(నరికిన తల) రాక్షసుడు అమ్మాయిలను అపహరించడం ప్రారంభిస్తాడు. దాంతో చండేలీ గ్రామంలో మరలా టెన్షన్ మొదలవుతుంది. ఈ సర్కత ఎవరు? అమ్మాయిలను ఎందుకు అపహరిస్తున్నాడు. రాజ్ కుమార్ రావ్, శ్రద్దా కపూర్ సర్కతకు ఎలా చెక్ పెట్టారు? అనేది మిగతా కథ. కామెడీ, హారర్ రెండు బాగా వర్క్ అవుట్ అయ్యాయి. దాంతో సినిమా బ్లాక్ బస్టర్ అందుకుంది.