https://oktelugu.com/

Ileana D’Cruz: నా గురించి తప్పుగా అనుకున్నారు… వాళ్ళ వలనే సౌత్ లో అవకాశాలు రాలేదు, బాంబు పేల్చిన ఇలియానా!

దేవదాసు సూపర్ హిట్ కాగా, పోకిరి టాలీవుడ్ రికార్డ్స్ అన్నీ తుడిచిపెట్టింది. పోకిరి సినిమాలో పిచ్చ గ్లామరస్ గా ఇలియానాను ప్రజెంట్ చేశాడు పూరి జగన్నాధ్.

Written By:
  • S Reddy
  • , Updated On : May 1, 2024 / 03:32 PM IST

    ileana away from tollywood because of that director

    Follow us on

    Ileana D’Cruz: టాలీవుడ్ స్టార్స్ హీరోయిన్స్ లో ఒకరిగా తిరుగులేని ఫేమ్ అనుభవించింది ఇలియానా డి క్రూజ్. గోవాకు చెందిన ఇలియానాను దర్శకుడు వైవిఎస్ చౌదరి సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు. 2006లో విడుదలైన దేవదాసు ఆమె డెబ్యూ మూవీ. అనూహ్యంగా రెండో సినిమాకే సూపర్ స్టార్ మహేష్ పక్కన ఛాన్స్ కొట్టేసింది. అదే ఏడాది విడుదలైన పోకిరి ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసింది. దేవదాసు సూపర్ హిట్ కాగా, పోకిరి టాలీవుడ్ రికార్డ్స్ అన్నీ తుడిచిపెట్టింది. పోకిరి సినిమాలో పిచ్చ గ్లామరస్ గా ఇలియానాను ప్రజెంట్ చేశాడు పూరి జగన్నాధ్.

    ఆ దెబ్బతో ఇలియానాకు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు, ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి టాప్ స్టార్స్ తో ఆఫర్స్ క్యూ కట్టాయి. అటు తమిళంలో కూడా ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. కెరీర్ పీక్స్ లో ఉండగా సడన్ గా బాలీవుడ్ కి చెక్కేసింది. రన్బీర్ కపూర్, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలు చేసిన బర్ఫీ మూవీలో సెకండ్ హీరోయిన్ గా ఇలియానా నటించింది. బర్ఫీ హిట్ టాక్ తెచ్చుకుంది.

    బర్ఫీ హిట్ క్రెడిట్ ప్రియాంక చోప్రా కొట్టేసింది. వరుసగా హిందీ చిత్రాలు చేస్తూ సౌత్ ని నిర్లక్ష్యం చేసింది. బాలీవుడ్ లో ఎదగాలన్న ఆమె ఆశలు నెరవేరలేదు. అక్కడ ఆమెకు బ్రేక్ రాలేదు. చిన్నా చితకా చిత్రాలు చేస్తూ లాక్కొచ్చింది. మరోవైపు ఆమెను టాలీవుడ్ ప్రేక్షకులు మర్చిపోయారు. ఓ ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ని ప్రేమించిన ఇలియానా అతడు బ్రేకప్ చెప్పడంతో డిప్రెషన్ కి గురైంది. వరుస దెబ్బలతో ఇలియానా మానసిక వేదనకు గురైంది.

    ఒక దశలో ఆమె షేప్ అవుట్ అయ్యారు. అయితే సౌత్ సినిమాలు తాను రిజెక్ట్ చేయలేదట. హిందీ చిత్రాల్లో నటిస్తున్న తాను సౌత్ చిత్రాలు చేయదని దర్శక నిర్మాతలు భావించారట. అందుకే ఇలియానాకు ఆఫర్స్ రాలేదట. నేను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నిజాయితీగా నటించాను. కానీ రావాల్సినంత గుర్తింపు రాలేదు. అది ఎందుకో అర్థం కాలేదని ఇలియానా తాజా ఇంటర్వ్యూలో అన్నారు. కాగా గత ఏడాది పెళ్లి కాకుండానే తల్లి అయిన ఇలియానా అబ్బాయికి జన్మనిచ్చింది.