https://oktelugu.com/

Rajamouli and Mahesh Babu : పుష్ప 2 కే టిక్కెట్ రేట్ ఇలా ఉంటే రాజమౌళి మహేష్ బాబు సినిమాకు ఆస్తులు అమ్మాల్సిందేనా..?

సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది దర్శకులు వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 3, 2024 / 09:35 AM IST

    Rajamouli

    Follow us on

    Rajamouli and Mahesh Babu : సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది దర్శకులు వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక అందులో భాగంగానే తెలుగు సినిమా స్థాయిని పెంచుతూ తనను తాను భారీ రేంజ్ లో ఎస్టాబ్లిష్ చేసుకున్న దర్శకుడు రాజమౌళి… బాహుబలి సినిమాతో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు…

    తెలుగు సినిమా ఇండస్ట్రీ రేంజ్ అనేది రోజురోజుకి పెరిగిపోతూ ఉంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు నెంబర్ వన్ ఇండస్ట్రీగా తెలుగు సినిమాలే కొనసాగుతూ ఉండటం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న మన స్టార్ హీరోలు తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచే విధంగా ముందుకు దూసుకెళ్లడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇప్పటికే మన స్టార్ హీరోలు తమను తాము స్టార్లుగా ఎలివేట్ చేసుకోవడానికి విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు… ఇక ఇదిలా ఉంటే ఇండియాలోనే దిగ్గజ దర్శకుడి గా పేరు పొందిన దర్శక ధీరుడు రాజమౌళి ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టాయి. మరి అలాంటి రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు తో పాన్ వరల్డ్ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. మరి ఈ క్రమంలోనే వీళ్లిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఎలాంటి పెను ప్రభంజనాన్ని సృష్టించబోతుందనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ డిసెంబర్ 5 వ తేదీన అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప 2 సినిమా రిలీజ్ అవుతుంది.

    ఇక ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపధ్యంలో బెనిఫిట్స్ షోస్ కి గాని, ఆ తర్వాత పది రోజులకుగాని సినిమా టికెట్ల రేట్ల ను భారీ రేంజ్ లో పెంచినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా బెనిఫిట్ షో కోసమైతే టికెట్ రేట్లను భారీగా పెంచారు. మల్టీప్లెక్స్ లో సినిమా చూడాలి అంటే 1300 రూపాయలను వెచ్చించాల్సిన అవసరమైతే ఉంది. మరి ఇంత రేంజ్ లో టికెట్లను కొనుగోలు చేసి ప్రేక్షకులు సినిమాలు చూస్తారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

    ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా కేవలం 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. ఇక ఈ సినిమాకే ఈ రేంజ్ లో టికెట్ రేట్లను పెంచుతుంటే రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా 1300 కోట్ల రూపాయలతో తెరకెక్కుతుంది. మరి ఈ సినిమాకి టికెట్ల రేట్లు ఆకాశాన్ని అంటుతాయనే చెప్పాలి. ఇంకా దానికి తగ్గట్టుగానే ఫ్యామిలీ మొత్తం కలిసి ఈ సినిమా చూడాలంటే బ్యాంక్ నుంచి సెపరేట్ గా లోన్ తీసుకోవాలేమో అనేలా సామాన్య ప్రేక్షకులు బెంబేలెత్తుతున్నారు.

    ఇక ఏది ఏమైనా కూడా టికెట్స్ రేట్స్ పెంచడం వల్ల భారీ కలెక్షన్స్ అయితే వస్తాయి. మరి సినిమా సక్సెస్ అయితే ప్రేక్షకులు పెట్టిన డబ్బులకు సాటిస్ఫై అవుతాడు. లేకపోతే మాత్రం హీరో డైరెక్టర్ల మీద ప్రేక్షకుడు విపరీతమైన కోపంతో ఉంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…