TaTa SUMO : ప్రస్తుతం కారు అవసరం కొందరికి తప్పనిసరిగా మారింది. ఒకప్పుడు డబ్బున్న వారికి మాత్రమే 4 వెహికల్ ఉండేంది.ముఖ్యంగ పొలిటిషియన్ ఎక్కువగా కొన్ని కార్లను ప్రత్యేకంగా కొనుగోలు చేసేవారు. ఇవి ప్రయాణ అవసరాలతో పాటు వారి హుందా తనాన్ని నిలబెట్టేవి. వీరితో పాటు ట్రావెల్ ఏజెన్సీ వారికి అనుగుణంగా ఓ కారు పాపులర్ అయింది. అదే TaTa Sumo. టాటా సుమో పేరు చెప్పగానే సినిమాల్లో ఫ్యాక్షనిజం సీన్ గుర్తుకు వస్తుంది. ఇలాంటి సీన్ సినిమాలో ఉందంటే అందులో కచ్చితంగా పదికి మించి టాటా సుమోలు కనిపించేవి. అలాగే 10 మంది కలిసి ప్రయాణం చేయాలనుకుంటే టాటా సుమోను తీసుకెళ్లేవారు. అందరికీ అందుబాటులో ఉండి ఆదరించిన టాటా సుమో మళ్లీ రాబోతుందనే కథనాలు వెలువడుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..
1994లో TaTa కంపెనీ నుంచి మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన SUMO ప్రాథమిక ఎస్ యూవీగా గుర్తింపు పొందింది. గ్రాప్టింట్ సిస్టమ్ తో గంటకు 60 కిలోమీటర్ల వరకు ప్రయాణించే ఈ మోడల్ ఆటోమేటిక్ టెక్నాలజీ లెవల్లో పనిచేసేది. ఇందులో సస్పెన్షన్ డబుల్ స్వింగింగ్ ట్రాపెజియం, టోర్షన్ బార్, రియర్ యాక్సిల్ లు వంటివి ఇందులో ఉండేవి. ఎంత స్పీడు వెళ్లినా కంట్రోల్ చేసకోవడానికి వెంటిలేటెడ్ డిస్క్, ఫ్రంట్ బ్రేకులు కలిపి ఇందులో అమర్చారు. 2004 వరకు ఆటోమోబైల్ మార్కెట్లో అమ్మకాల్లో నెంబర్ వన్ గా నిలిచిన టాటా సుమోకు మహీంద్రా కార్ల నుంచి గట్టి పోటీ ఎదురైంది. దీంతో వీటి ఉత్పత్తిని నిలిపివేశారు.
ఎంతో మంది లైక్ చేసిన టాటా సుమోను మళ్లీ మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే నేటి వినియోగదారులకు అనుగుణంగా ఫీచర్స్, ఇంజిన్ ను మార్చి మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు చర్చలు జరుగుతున్నాయి. పాత టాటా సుమోలో 1.9 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉండేది. 5 స్పీడ్ మాన్యువల్ తో పనిచేసేంది. కానీ కొత్త వెర్షన్ 1.2 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ అనే రెండు ఇంజిన్లు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను అమర్చే అవకాశం ఉంది. ఈ ఇంజిన్ లీటర్ ఇంధనానికి 10 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
టాటా కంపెనీ అధికారికంగా ఈ వివరాలు బయటపెట్టనప్పటికీ కొత్త సుమో రావడం మాత్రం తథ్యం అని అంటున్నారు. అంతేకాకుండా కొత్త సుమో ధర రూ. 8 లక్షల నుంచి రూ. 10 లక్షలు ఉండే అవకాశం ఉంది. ఒకప్పటి సుమోలో 10 మంది ప్రయాణించేవారు. కానీ కష్టంగా ఉండేది. కానీ కొత్త సుమోలో 9 మంది సురక్షితంగా ప్రయాణించడానికి అనుగుణంగా బూట్ స్పేస్ ను పెంచనున్నారు. ఇందులో 7సీటర్ లేదా 9 సీటర్ ను ఏర్పాటు చేయనున్నారు.
మిగతా కార్లలో లాగే ఇందులో 9 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, పవర్ స్టీరింగ్ వీల్, పవర విండోస్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. అలాగే అడ్వాన్స్ టెక్నాలజీని జోడించనున్నారు.