Also Read : షకీల్ ‘తారక’మంత్రం..ఈ రాజకీయం వర్కవుట్ కాలే..!
నాగబాబు ఇటీవల యూట్యూబ్‌లో తన పేరిట ఓ చానల్ క్రియేట్ చేశాడు. తనకు తోచిన ఆలోచనలు, తన అభిప్రాయాలను పంచుకునేందుకు వేదికగా మలుచుకున్నాడు. ఏదో ఒక టాపిక్‌పై మాట్లాడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. సాధారణ ప్రజలకు ఉపయోగపడేవి.. వారిలోని ప్రతిభ వెలికితేయడానికి దీనిని ప్లాట్‌ఫాంగా చేసుకున్నట్లు చెబుతుంటాడు. కొత్తకొత్త ప్రోగ్రాంలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆ మధ్య మెడీ క్లెయిమ్ ఆవశ్యకతను చెప్పి ఎందరికో కనువిప్పు కలిగించాడు. తన సొంత అనుభవాలు చెబుతూ అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఇన్సురెన్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని వివరించాడు. ఇక ఖుషీఖుషీగా, విజిల్ అంటూ కొత్త ప్రోగ్రాంలు మొదలుపెట్టాడు.
సమాజంలో డబ్బుకు ఉన్న వ్యాల్యూ బంధాలకు, బంధుత్వాలకు లేదు. దోస్తానాలోనూ మచ్చుకైనా కనిపించవు. మరీ ఈ విషయంలో నాగబాబుకు చాలా అనుభవం. ఎన్నోసార్లు ఫైనాన్షియల్‌గా దెబ్బతిన్న ఆయనకు డబ్బు ప్రాముఖ్యత బాగానే తెలుసు. అందుకే ఆయనఅంటుంటారు డబ్బు సంపాదించడమే గ్రేటెస్ట్ పని.. అంటూ.
Also Read : టాలీవుడ్ సినీ రాజకీయం: సాయం హీరోది.. బొక్క నిర్మాతకీ..!
తాజాగా.. ఓ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గురించి నాగబాబు సంచలన కామెంట్స్ చేశారు. యూట్యూబ్ వేదికగా ఆయన మాటలను రిలీజ్ చేశారు. ‘పేరు చెప్పను గానీ ఓ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్.. అతన్ని కోరుకోని హీరో లేడు. అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ యాక్టర్.. అప్పుల మీద అప్పులు చేస్తుంటాడు.. నిజంగా అతని పొజిషన్‌లో నేను ఉంటే ఈ పాటికి ఓ రెండు వేల కోట్లు సంపాదించేవాడిని’ అంటూ నాగబాబు చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ సదరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరై ఉంటారా? అని అందరూ మెదడుకు పని చెబుతున్నారు.