Also Read : ప్రేమ.. పగ.. యాసిడ్ దాడి..మగాళ్లు జాగ్రత్త.. ఆడోళ్లు ‘పోసేస్తున్నారు’..!”
అయితే బాధితురాలు మీడియా ముందుకొచ్చిన ప్రతీసారి మాటమారుస్తుంటంపై పలు అనుమానాలు కలుగుతున్నారు. ఈ కేసు ప్రారంభంలో బాధితురాలు తనను 139మంది రేప్ చేసినట్లు ఆరోపించింది. ఇందులో సినీ రంగానికి చెందిన యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడు కూడా ఉన్నారని తెలిపింది. దీంతో ఈ కేసుపై ప్రజల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఇటీవల మీడియా ముందుకొచ్చిన బాధితురాలు తనను 139మంది రేప్ చేయలేదని స్పష్టం చేసింది. కేవలం 40శాతం మంది మాత్రమే తనను లైంగికంగా హింసించారని పేర్కొంది. అంతేకాకుండా యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడికి ఈ కేసుతో సంబంధం లేదంటూ షాకిచ్చింది.
డాలర్ బాయ్ అనే వ్యక్తి బెదిరించడంతోనే తాను యాంకర్ ప్రదీప్, నటుడు కృష్ణుడు పేర్లు చెప్పానని చెప్పుకొచ్చింది. దీంతో ఈ కేసు నీరుగారిపోతుందా? అనే అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ కేసులో బాధితురాలు తనకు డ్రగ్ ఇచ్చి రేప్ చేశారని ఆరోపించడంతో ఆదిశలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఉద్యోగ రీత్య పరిచయమైన డాలర్ భాయ్ తనతో చనువుగా ఉండేవాడని.. డ్రగ్ ఇచ్చి తనను శారీరకంగా లొంగదీసుకున్నాడని ఆరోపించింది. తనను శారీరకంగా.. మానసికంగా హింసించాడని.. పెళ్లి చేసుంటానని డాలర్ బాయ్ నమ్మించి మోసం చేశాడని వాపోయింది.
Also Read : టాలీవుడ్ సినీ రాజకీయం: సాయం హీరోది.. బొక్క నిర్మాతకీ..!
139మంది రేప్ కేసులో 50శాతం మంది అమాయకులే ఉన్నారని.. కేవలం 36మంది తనను లైంగికంగా హింసించారనని తాజాగా వెల్లడించింది. బాధితురాలు రోజుకో ట్వీస్ట్ ఇచ్చే కథను చెబుతుండటంతో ఈ కేసు చివరికీ ఏమవుతుందనే అనుమానాలు కలుగుతున్నారు. సస్పెన్స్ థిల్లర్ ను తలపిస్తున్న 139మంది రేప్ కేసు మున్ముందు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే..!