https://oktelugu.com/

నేటి నటిమణుల్లో ఈ నటి తీరు వేరు !

వెండితెర పై ఎంతో పద్ధతిగా పవిత్రంగా కనిపించే నటిమణుల్లో నటి ‘ప్రగతి’ కూడా ముఖ్యులు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈమె చేసే పాత్రలు అన్నీ నిండితనంతో చక్కని సంస్కారవంతమైనవిగా ఉంటాయి. అయితే నిజ జీవితంలో మాత్రం తానూ పక్కా మాస్ అండ్ బోల్డ్ అంటుంది ప్రగతి ఆంటీ. ఆమె చేసే డాన్స్ లు ఆమె చేసే వర్కౌట్స్ చూస్తుంటే.. సినిమాల్లో ఆమె కనిపించే దానికి ఎంతో, నిజ జీవితంలో ఈమె ప్రవర్తించే దానికి చాలా తేడా కనిపించేలానే […]

Written By:
  • admin
  • , Updated On : September 4, 2020 / 03:27 PM IST
    Follow us on


    వెండితెర పై ఎంతో పద్ధతిగా పవిత్రంగా కనిపించే నటిమణుల్లో నటి ‘ప్రగతి’ కూడా ముఖ్యులు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈమె చేసే పాత్రలు అన్నీ నిండితనంతో చక్కని సంస్కారవంతమైనవిగా ఉంటాయి. అయితే నిజ జీవితంలో మాత్రం తానూ పక్కా మాస్ అండ్ బోల్డ్ అంటుంది ప్రగతి ఆంటీ. ఆమె చేసే డాన్స్ లు ఆమె చేసే వర్కౌట్స్ చూస్తుంటే.. సినిమాల్లో ఆమె కనిపించే దానికి ఎంతో, నిజ జీవితంలో ఈమె ప్రవర్తించే దానికి చాలా తేడా కనిపించేలానే ఉంది. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్టార్ హీరోలందరికీ అమ్మగానో, అత్తగానో నటించి మెప్పించిన ప్రగతి.. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మోడ్రన్ మదర్‌ గా మన పక్కింటి ఆంటీగా బాగానే పాపులారిటీ సంపాధించుకుంది. కానీ ఆమె పాపులారిటీ విషయంలో లాక్ డౌన్ కి ముందు, లాక్ డౌన్ కి తరువాత అని చెప్పుకోవాలేమో.

    Also Read: టాలీవుడ్ సినీ రాజకీయం: సాయం హీరోది.. బొక్క నిర్మాతకీ..!

    నిజానికి ఈ లాక్‌ డౌన్ లో తెలుగు నటిమణుల్లో చాలామంది సోషల్ మీడియాలో తమ శైలిలో రెచ్చిపోయారు. అయితే వారందరిలోకల్లా ప్రగతి ఆంటీ సాధించిన క్రేజ్ సంపాదించుకున్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. మరో నటీమణికి సాధ్యం కాని స్థాయిలో తనలోని బోల్డ్ డాన్స్ టాలెంట్ ను బయటపెట్టేసింది ప్రగతి. అసలు ఈ మధ్య కాలంలో ప్రగతి సోషల్ మీడియాలో చేసిన రచ్చ గురించి ఎంత మొర పెట్టుకున్నా అది ఖచ్చితంగా తక్కువే అవుతుందనేది నెటిజన్ల అభిప్రాయం. అసలు లుంగీ కట్టుకుని ప్రగతి మాస్ స్టెప్పులు వేస్తుంటే కుర్రకారుకు పూనకం వచ్చేసింది. అలాగే క్లాస్ సాంగ్‌ కు ప్రగతి ఆంటీ క్లాసికల్ డ్యాన్సులు వేస్తూ వయ్యారాలను ఒలకబోయడం చూశాక, హీరోయిన్స్ కూడా తప్పనిసరిగా కుళ్ళుకుంటారు అని సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా కనిపిస్తున్నాయంటే.. ప్రగతి ఏ రేంజ్ లో రెచ్చిపోతుందో అర్ధం చేసుకోవచ్చు.

    Also Read : ప్రేమ.. పగ.. యాసిడ్ దాడి..మగాళ్లు జాగ్రత్త.. ఆడోళ్లు ‘పోసేస్తున్నారు’..!

    మొత్తానికి నటి ప్రగతి.. కరోనా కాలంలో కూడా నెటిజన్లను ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తూ ఉంది. ఆయితే ఏభైకి దగ్గరలో ఉన్న ఏజ్ లో ఎందుకు బ్రేకింగ్ డాన్స్ లు అని అడుగగా.. ‘చిన్నప్పటి నుండి తనకు డ్యాన్స్ అంటే బాగా ఇష్టమని, ఆ ఇష్టంతోనే డాన్స్ ను నేర్చుకున్నానని, కాకపోతే ఎన్నడూ వెండితెర పై తనకు తన డాన్స్ ప్రతిభను చూపించుకునే అవకాశం రాలేదని.. అందువల్లే ఇప్పుడు సోషల్ మీడియాలో నా డాన్స్ ను చూపిస్తున్నానని సెలవిచ్చింది ప్రగతి ఆంటీ. అయితే, ఈ వయసులోనూ ప్రగతి ఫిట్ నెస్ మెయింటైన్ చేస్తూ.. శక్తికి మించిన బరువులు ఎత్తుతూ, ఆశ్చర్యం కలిగించే వర్కౌట్లు చేయడం మాత్రం నిజంగా విశేషమే. తాజాగా ఈ వర్కౌట్స్ వీడియోను అప్ లోడ్ చేసింది. ఏమైనా నేటి నటిమణుల్లో ఈ నటి తీరు వేరయ్యా అంటున్నారు ఆమె ఫాలోవర్స్.