‘ఐకాన్’ను స్టార్ట్ చేయనున్న ఐకాన్ స్టార్ !

అల్లు అర్జున్ ‘ఐకాన్’ అనే సినిమా చేయాలని ఫిక్స్ అయిన తరువాత వెంటనే చేసిన పని, తనకున్న ‘స్టైలీష్ స్టార్’ అనే బిరుదును తీసేసి.. తానూ ఇక నుండి ‘ఐకాన్ స్టార్’ అంటూ తన టీమ్ చేత గట్టిగా ప్రమోట్ చేయించుకోవడం, అల్లు అర్జున్ తనకు తానే ఇలా డప్పు కొట్టించుకోవడం ఏమిటి ? అంటూ యాంటీ ఫ్యాన్స్ నెగిటివ్ కామెంట్స్ తో బన్నీని ట్రోల్ చేసినా.. బన్నీ మాత్రం తానూ ఇక నుండి ఐకాన్ స్టార్ […]

Written By: admin, Updated On : July 8, 2021 4:40 pm
Follow us on

అల్లు అర్జున్ ‘ఐకాన్’ అనే సినిమా చేయాలని ఫిక్స్ అయిన తరువాత వెంటనే చేసిన పని, తనకున్న ‘స్టైలీష్ స్టార్’ అనే బిరుదును తీసేసి.. తానూ ఇక నుండి ‘ఐకాన్ స్టార్’ అంటూ తన టీమ్ చేత గట్టిగా ప్రమోట్ చేయించుకోవడం, అల్లు అర్జున్ తనకు తానే ఇలా డప్పు కొట్టించుకోవడం ఏమిటి ? అంటూ యాంటీ ఫ్యాన్స్ నెగిటివ్ కామెంట్స్ తో బన్నీని ట్రోల్ చేసినా.. బన్నీ మాత్రం తానూ ఇక నుండి ఐకాన్ స్టార్ నే అంటూ ఫిక్స్ అయిపోయాడు.

మరి తనకు ఐకాన్ స్టార్ అనే ఐడియాని ఇచ్చిన ‘ఐకాన్’ సినిమాని మొదలుపెట్టక పొతే ఎలా? అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఐకాన్ ను స్టార్ట్ చేసే పనిలో ఉన్నాట్ట అల్లు అర్జున్ బాబు. ఎలాగూ ‘పుష్ప’ షూటింగ్ కి గ్యాప్ కూడా ఇవ్వడం లేదు కాబట్టి, పుష్ప త్వరగానే పూర్తి అవుతుంది. ఆ వెంటనే ‘ఐకాన్’ షూట్ మొదలవుతుందట.

ప్రస్తుతం ‘పుష్ప’ షూటింగ్ హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో చేస్తున్నారు. బన్నీకి సంబంధించిన ఎంట్రీ సన్నివేశాలను ప్రస్తుత షెడ్యూల్ లో తీస్తున్నారు. నిజానికి సుకుమార్ ఈ సీన్స్ ను విదేశాల్లో తీద్దామనుకున్నాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సన్నివేశాలను ఫారెన్ లో తీయడం చాల కష్టం. అందుకే లోకల్ లోనే చిత్రీకరిస్తున్నారు.

మరో నెల రోజుల్లో పుష్ప షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. ఆ తర్వాత ‘వకీల్ సాబ్’ ఫేమ్ శ్రీరామ్ వేణు తీసే ‘ఐకాన్’ షూటింగ్ కోసం బన్నీ తన డేట్స్ ను కేటాయించనున్నాడు. అన్నట్టు దిల్ రాజు ప్రొడక్షన్ లోనే ఈ భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కనుంది. అల్లు అర్జున్ ఈ సినిమాని స్పీడ్ గా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడని టాక్.