
సీఎం జగన్ కేంద్రానికి లేఖలు రాయడం దొంగే దొంగ అన్నట్లుగా ఉందని జగదీష్ రెడ్డి విమర్శించారు. పోతిరెడ్డిపాడు నీటిని అక్రమంగా తోడుకుపోతున్నారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం 203 జీవోను వెనక్కి తీసుకుని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ఆపాలని ఆయన సూచించారు. వరద జలాల పేరుతో శ్రీశైలం ప్రాజెక్టు నీళ్లను, ఇన్నాళ్లుగా అక్రమంగా తీసుకుపోయారు. ఇక ఆటలు సాగవని హెచ్చరించారు. జగన్ ఎన్ని రోజులు లేఖలు రాసినా ఫలితం ఉండదన్నారు.