spot_img
Homeఎంటర్టైన్మెంట్'ఐకాన్'ను స్టార్ట్ చేయనున్న ఐకాన్ స్టార్ !

‘ఐకాన్’ను స్టార్ట్ చేయనున్న ఐకాన్ స్టార్ !

అల్లు అర్జున్ ‘ఐకాన్’ అనే సినిమా చేయాలని ఫిక్స్ అయిన తరువాత వెంటనే చేసిన పని, తనకున్న ‘స్టైలీష్ స్టార్’ అనే బిరుదును తీసేసి.. తానూ ఇక నుండి ‘ఐకాన్ స్టార్’ అంటూ తన టీమ్ చేత గట్టిగా ప్రమోట్ చేయించుకోవడం, అల్లు అర్జున్ తనకు తానే ఇలా డప్పు కొట్టించుకోవడం ఏమిటి ? అంటూ యాంటీ ఫ్యాన్స్ నెగిటివ్ కామెంట్స్ తో బన్నీని ట్రోల్ చేసినా.. బన్నీ మాత్రం తానూ ఇక నుండి ఐకాన్ స్టార్ నే అంటూ ఫిక్స్ అయిపోయాడు.

మరి తనకు ఐకాన్ స్టార్ అనే ఐడియాని ఇచ్చిన ‘ఐకాన్’ సినిమాని మొదలుపెట్టక పొతే ఎలా? అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఐకాన్ ను స్టార్ట్ చేసే పనిలో ఉన్నాట్ట అల్లు అర్జున్ బాబు. ఎలాగూ ‘పుష్ప’ షూటింగ్ కి గ్యాప్ కూడా ఇవ్వడం లేదు కాబట్టి, పుష్ప త్వరగానే పూర్తి అవుతుంది. ఆ వెంటనే ‘ఐకాన్’ షూట్ మొదలవుతుందట.

ప్రస్తుతం ‘పుష్ప’ షూటింగ్ హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో చేస్తున్నారు. బన్నీకి సంబంధించిన ఎంట్రీ సన్నివేశాలను ప్రస్తుత షెడ్యూల్ లో తీస్తున్నారు. నిజానికి సుకుమార్ ఈ సీన్స్ ను విదేశాల్లో తీద్దామనుకున్నాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సన్నివేశాలను ఫారెన్ లో తీయడం చాల కష్టం. అందుకే లోకల్ లోనే చిత్రీకరిస్తున్నారు.

మరో నెల రోజుల్లో పుష్ప షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. ఆ తర్వాత ‘వకీల్ సాబ్’ ఫేమ్ శ్రీరామ్ వేణు తీసే ‘ఐకాన్’ షూటింగ్ కోసం బన్నీ తన డేట్స్ ను కేటాయించనున్నాడు. అన్నట్టు దిల్ రాజు ప్రొడక్షన్ లోనే ఈ భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కనుంది. అల్లు అర్జున్ ఈ సినిమాని స్పీడ్ గా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడని టాక్.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...
Lenin 2 Weeks Collections

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Oktelugu Epaper