ఆదివారం నాడు పేస్ బుక్ వేదికగా జరిగిన లైవ్ ప్రోగ్రాం ! FOR INDIA చాలా ఘనమైన ప్రతిస్పందన తెచ్చుకొంది. హేమా హేమీలైన సినీ నటులు , సంగీత దర్శకులు పాల్గొన్న ఈ ప్రాగ్రాం నిర్వాహకుల అంచనాలకు మించి సక్సెస్ అయ్యింది . హిందీ చలన చిత్ర హీరోలైన అమీర్ ఖాన్ , షారుఖ్ ఖాన్ వంటి దిగ్గజ నటులతో పాటు, సౌత్ హీరోలు దుల్కర్ సల్మాన్ వంటి వారు పాల్గొన్న ఈ కారక్రమంలో మన సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ కూడా కీలక భూమిక పోషించాడు .
నెలాఖరి వరకు లాక్ డౌన్:కేసీఆర్
చాలా ఘనం గా జరిగిన ఈ లైవ్ సంగీత కార్యక్రమం పట్ల దుల్కర్ సల్మాన్ తన స్పందన తెలియజేస్తూ ” మా హృదయ పూర్వకంగా చెబుతున్నాము . ఒక కచేరి లా మొదలైన ఈ కార్యక్రమం ఉద్యమంలా మారింది విరాళాలు వెల్లువెత్తాయి. `ఐ ఫర్ ఇండియా` కి విరాళమిచ్చిన అందరికి మా కృతజ్ఞతలు. మన మంతా కలిసి ఒక ఆరోగ్య వంతమైన సమాజాన్ని నిర్మిద్దాం ..” అంటూ ట్వీట్ చేయడం జరిగింది . .కాగా ప్రపంచం లోనే అతిపెద్ద లైవ్ షో గా గుర్తింపు తెచ్చుకొన్న ఈ పేస్ బుక్ సంగీత కార్య క్రమం ద్వారా మొత్తం 52 కోట్ల విరాళం పొగవడం విశేషం … వీలున్నంత త్వరలో ఈ 52 కోట్ల విరాళాన్ని దేశంలో ఉన్న 100 ఎన్ జి ఓ లకు ఇవ్వడం జరుగుతుంది .
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: I for india concert raises rs 52 crore
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com