
కరోనా ఉపద్రవం ప్రారంభమైన ఈ సమయంలో చిల్లర రాజకీయాలకు చోటు లేదని అంటూ ప్రధాని మోదీపై ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే కేసులు పెడతామని హెచ్చరించిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇప్పుడు అకస్మాత్తుగా స్వరం పెంచి కేంద్రానికి హెచ్చరికలు జారీచేయడం పలువురికి ఆశ్చర్యం కలిగిస్తున్నది. తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడం కోసం కేంద్రంపై కన్నెర్ర చేస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
తెలంగాణలో కరోనా పోరును ఇప్పుడు కుమారుడు కేటీఆర్ కైవసం చేసుకొని, కరోనా టెస్ట్ లను దాదాపు ఆపివేయించినట్లు కధనాలు వెలువడుతున్నాయి. కరోనా కేసులు, మరణాల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న లెక్కలు తప్పుల తడక అంటూ `డాక్టర్స్ ఫర్ సేవ’ పేరుతో కొందరు వైద్యులు, వైద్యరంగా నిపుణులు కలసి ఈ మధ్య హైదరాబాద్ కు వచ్చిన కేంద్ర బృందానికి ఇచ్చిన పత్రం ఆందోళనకర అంశాలను వెలుగులోకి తెచ్చింది.
నెలాఖరి వరకు లాక్ డౌన్: కేసీఆర్
పలువురు ప్రైవేట్ ఆసుపత్రులలో మరణిస్తున్న వారిని కరోనా మరణాలుగా అనుమానం వ్యక్తం చేసింది. గత నెల సూర్యాపేటలో ఒకేరోజు 83 కరోనా కేసులు బైట పడగా, ఆ మరుసటి రోజు అక్కడకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి వెళ్లి వచ్చినప్పటి నుండి ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడాన్ని ఉదహరించారు. ప్రభుత్వం వత్తిడులు తెచ్చి టెస్టులు చేయించడం లేదని ఆరోపించారు.
తెలంగాణలో దాదాపు కరోనా టెస్ట్ లను ఆపివేసి ఈ వైరస్ అదృశ్యమైన్నట్లు చూపే ప్రయత్నం చేస్తున్నారు. కరోనా కట్టడిలో కీలక పాత్ర వహించిన ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ ను పక్కన పెట్టి అంతా కేటీఆర్ చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ వత్తిడుల కారణంగా కరోనాపై రాజీ పడుతూ, ప్రజల దృష్టి మళ్లించడానికా అన్నట్లు ఇప్పుడు నెలన్నర రోజుల తర్వాత కేంద్రంపై ఇప్పుడు నిప్పులు కురుస్తున్నట్లు స్పష్టం అవుతున్నది.
మత సామరస్యం సాధ్యమేనా ? (Part 4)
లాక్‌డౌన్ కారణంగా నష్టాలను పరిష్కరించాలని అడిగితే కేంద్ర ప్రభుత్వం ఉలుకూ పలుకూలేకుండా ఉందని కేసీఆర్ మండిపడ్డారు. జీతాలు చెల్లించడానికి సరిపడిన ఆదాయం రావడం లేదని వాపోయారు. కేంద్రం వద్ద కూడా నిధులు ఉండవని తెలిసే ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచమంటే ప్రధాని మోదీ నుండి స్పందన లేదని విమర్శించారు.
డబ్బులు ఇవ్వలేరు కాబట్టి ఒక మార్గం చూపినా కేంద్రం పలకడం లేదని అంటూ సమయం వచ్చినప్పుడు చాలా తీవ్రంగా స్పందింస్తామని అంటూ కేంద్రాన్ని హెచ్చరించారు. బెల్లం కొట్టిన రాయిలా ఉన్నదని అంటూ కేంద్రం మౌనం పాటించాలనుకోవడం కరెక్టు కాదని ధ్వజమెత్తారు.
ఎఫ్‌ఆర్‌బీఎం రుణాలకు, ఇతర రుణాలకు డిఫర్మెంట్ ఇవ్వండని ప్రధానిని అడిగాను.. ఇది చిన్న పని కదా.. కేంద్రం ఎందుకు చేయడం లేదు? అంటూ ప్రశ్నించారు. డబ్బులు ఇవ్వకపోగా కేంద్రం చాలా సంకుచిత మనస్తత్వంతో వ్యవహరిస్తున్నదని ఆరోపించారు.
మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ లో చేదు వార్త!
వలస కూలీలకు రైలు ఛార్జీ టికెట్ వసూలు చేయడం పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. ఇది అన్యాయం అంటూ తెలంగాణలో ప్రభుత్వమే ఈ చార్జీలు చెల్లిస్తున్నదని, ఈ రోజే రూ 4 కోట్లు కట్టమని చెప్పారు. రైల్వే ఛార్జీలు ఇచ్చే పైసలు కేంద్రం దగ్గర లేవా? సిగ్గుపోతది. ఇంత అధ్వానమా? అంటూ ఎద్దేవా చేశారు.
విద్యుత్ నియంత్రణ మండలిలను నియమించే రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను తీసివేస్తూ కేంద్రం బిల్లు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తుండటం పట్ల కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం అని స్పష్టం చేశారు. కేంద్రం తెచ్చే బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తామని వెల్లడించారు. పార్లమెంటులో భూమిని ఆకాశాన్ని ఒకటిచేసి ఆ బిల్లు పాస్ కానీయమని కేసీఆర్ హెచ్చరించారు.