Karan Johar : ఈ ఫొటోలో కనిపిస్తున్న నిర్మాత ని ఎవరైనా గుర్తు పట్టారా..?, ఈయన ఒక నిర్మాత మాత్రమే కాదు, గొప్ప రచయితా, గొప్ప దర్శకుడు కూడా. ఎన్నో కల్ట్ క్లాసిక్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు, నిర్మించాడు, ఇప్పటికీ అది కొనసాగిస్తూనే ఉన్నాడు. అంతెందుకు మన తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుండి వస్తున్న సినిమాలు నేడు పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై సెన్సేషన్ సృష్టిస్తున్నాయంటే, అందుకు ఈయన అందించిన సహకారం చాలానే ఉంది. కేవలం సినీ రంగం లో మాత్రమే కాకుండా, బుల్లితెర పై, ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ పై ఎన్నో రియాలిటీ షోస్ ని నిర్మించి సంచలనం సృష్టించిన చరిత్ర ఆయనది. అలాంటి నిర్మాత ఇప్పుడు ఇలాంటి పరిస్థితి లో కనిపించడం చూసి నెటిజెన్స్ షాక్ కి గురయ్యారు. అసలు ఏమైంది ఈయనకి?, ఆరోగ్యం బాగానే ఉందా? అని ఆరాలు తీస్తున్నారు నెటిజెన్స్.
ఇంతకీ ఆయన ఎవరో కాదు, బాలీవుడ్ టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్(Karan Johar). షారుఖ్ ఖాన్(Sharukh Khan), అమీర్ ఖాన్(Amir Khan), సల్మాన్ ఖాన్(Salman Khan), హృతిక్ రోషన్(Hrithik Roshan) లాంటి సూపర్ స్టార్స్ తో ఎన్నో అద్భుతమైన క్లాసిక్ చిత్రాలను నిర్మించాడు. మన టాలీవుడ్ కి నార్త్ ఇండియా ఎంట్రీ పాస్ ని ఇప్పిస్తూ బాహుబలి చిత్రాన్ని గ్రాండ్ గా అక్కడ రిలీజ్ చేయించాడు. ఆ సినిమా కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో, బాహుబలి 2 ని మరింత గ్రాండ్ గా రిలీజ్ చేసి బాలీవుడ్ రికార్డ్స్ ని కొల్లగొట్టాడు. గత ఏడాది ఎన్టీఆర్ దేవర చిత్రాన్ని హిందీ లో విడుదల చేసింది ఈయనే, ఈ ఏడాది మిరాయ్ చిత్రాన్ని విడుదల చేసింది కూడా ఈయనే. రాబోయే రోజుల్లో ఇంకా గొప్ప సినిమాలు ఈయన ప్రొడక్షన్ నుండి రాబోతుంది. ఇక ఆయన రీసెంట్ ఫోటోలను చూసి అసలు ఈయనకి ఏమైంది?, ఆరోగ్యం సరిగ్గానే ఉందా? అని అంతా భయపడ్డారు.
కానీ అది ఆయన అనారోగ్యం కారణంగా పీనుగు లాగా మారిపోలేదు. వర్కౌట్స్ చేయడం వల్లనే అలా అయిపోయాడు అంటూ కరణ్ జోహార్ కి బాగా దగ్గరైన వారు చెప్తున్నారు. కొంతమంది అయితే ఆయన లుక్స్ పై ట్రోల్స్ కూడా చేస్తున్నారు. బాలీవుడ్ లో కరణ్ జోహార్ కి నెపోటిజం ని ప్రోత్సహిస్తున్నాడని ఒక సెక్షన్ ఆడియన్స్ నుండి తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అఘాయిత్యం చేసుకున్నప్పుడు,బాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ తీవ్రమైన వ్యతితేకత ఎదురుకున్నారు. వారిలో కరణ్ జోహార్ కూడా ఒకడు. వాళ్ళే ఇప్పుడు ఆయన లుక్స్ పై ట్రోల్స్ చేస్తున్నారు. సుశాంత్ సింగ్ కి చేసిన అన్యాయం ఊరికే పోతుందా?, అందుకే ఇలా ఐపోయాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.