spot_img
Homeఎంటర్టైన్మెంట్Sreeleela: ఎందరు అడిగినా ఐటెం సాంగ్ చేయలేదు, పుష్ప 2లో చేశా, అందుకు రీజన్ ఏంటంటే?...

Sreeleela: ఎందరు అడిగినా ఐటెం సాంగ్ చేయలేదు, పుష్ప 2లో చేశా, అందుకు రీజన్ ఏంటంటే? సస్పెన్సు లో పెట్టిన శ్రీలీల!

Sreeleela: యంగ్ బ్యూటీ శ్రీలీల పుష్ప 2లో ఐటెం సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. పార్ట్ 1లో స్టార్ లేడీ సమంత ఐటెం భామగా అలరించింది. ఊ అంటావా మామా.. సాంగ్ దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. సమంత బోల్డ్ స్టెప్స్, హాట్ మేనరిజమ్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాయి. సమంత ఒక ట్రెండ్ సెట్ చేసిన నేపథ్యంలో పుష్ప 2లో ఐటెం సాంగ్ ఎవరు చేస్తారా? అనే సస్పెన్స్ నెలకొంది. పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. శ్రీలీల ఫైనల్ అయ్యింది.

శ్రీలీల ప్రొఫెషనల్ డాన్సర్. గతంలో పలు సినిమాల్లో శ్రీలీల తన ఎనర్జిటిక్ స్టెప్స్ తో యూత్ ని ఊపేసింది. కాబట్టి శ్రీలీల బెస్ట్ ఛాయిస్ అనడంలో సందేహం లేదు. అయితే సమంత స్థాయిలో మెప్పిస్తుందా, ఊ అంటావా మామా సాంగ్ వలె జనాల్లోకి వెళుతుందా? అనే సందేహాలు అయితే ఉన్నాయి. కిస్సిక్ పేరుతో ఈ ఐటెం సాంగ్ ఇటీవల విడుదలైంది. అయితే డాన్స్ పార్ట్ పెద్దగా చూపలేదు. దాంతో శ్రీలీల పెర్ఫార్మన్స్ అప్పుడే అంచనా వేయలేం.

శ్రీలీల కిస్సిక్ సాంగ్ పై సమంత స్పందించడం విశేషం. శ్రీలీల అద్భుతంగా చేసిందన్న అర్థంలో కామెంట్ పోస్ట్ చేసింది. కామ్ గా పుష్ప 2 కొరకు వెయిట్ చేయండని సమంత ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టింది. అయితే పుష్ప 2 లో ఐటెం చేయడానికి కారణం ఉందని శ్రీలీల అన్నారు. నితిన్ కి జంటగా రాబిన్ హుడ్ మూవీ చేస్తున్న శ్రీలీల, టీం తో పాటు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆమెకు పుష్ప 2 మూవీ ఐటెం సాంగ్ కి సంబంధించిన ప్రశ్న ఎదురైంది.

కెరీర్ పీక్స్ లో ఉండగా ఐటెం సాంగ్ చేశారు, రిస్క్ కాదా? అని అడగ్గా… గతంలో ఐటెం సాంగ్ ఆఫర్స్ వచ్చినా చేయలేదు. అయితే పుష్ప 2లోని కిస్సిక్ ఆర్డినరీ ఐటెం సాంగ్ కాదు. నేను ఈ సాంగ్ చేయడానికి ఓ కారణం ఉంది. అదేమిటో మీరు డిసెంబర్ 5న తెలుసుకుంటారు, అని శ్రీలీల అన్నారు. ఆ కారణం ఏమిటీ? ఒక వేళ శ్రీలీల సాంగ్ తో పాటు చిన్న గెస్ట్ రోల్ ఏమైనా చేసిందా? అనే సందేహాలు కలుగుతున్నాయి. మొత్తంగా శ్రీలీల సస్పెన్సు లో పెట్టింది.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version