Ritu Choudhary : గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియా లో రీతూ చౌదరి పేరు ఎలా వినిపిస్తుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. విజయవాడ లోని ఇబ్రహీం పట్నం ల్యాండ్ రిజిస్ట్రేషన్ స్కాం లో రీతూ చౌదరి పేరు కూడా ఉండడం సంచలన టాపిక్ గా మారింది. జబర్దస్త్ లాంటి షోస్ చేసుకునే అమ్మాయికి 700 కోట్ల రూపాయిల భారీ స్కాంలో చిక్కుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటూ ఆమె అభిమానులు ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇన్ని రోజులు తనకి అసలు పెళ్లి కాలేదు అంటూ చెప్పుకొచ్చిన రీతూ చౌదరి కి చీమకుర్తి శ్రీకాంత్ భర్త ఎలా అయ్యాడు అంటూ ప్రశ్నలు తలెత్తాయి. అయితే రీసెంట్ గా ఆమె ఒక ప్రముఖ టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ, తనకి పెళ్ళైన విషయం వాస్తవమే, కానీ నాలుగు నెలలు మాత్రమే కలిసి ఉన్నాము, ఆ తర్వాత నాకు అతని ప్రవర్తన నచ్చక విడిపోయాను.
విడాకుల కోసం కోర్టు కి దరఖాస్తు కూడా చేసుకున్నానో చెప్పుకొచ్చింది. ఇంకా ఆమె మాట్లాడుతూ ‘ఈ స్కాం లో నాకు ఎలాంటి సంబంధం లేదు. నా పేరు మీద ఉన్న ఆ భూమి ఎక్కడుందో కూడా నాకు తెలియదు, సంతకం పెట్టమంటే పెట్టాను. ఇది ఇంత స్కాం కి సంబంధించినది అని మాత్రం ఊహించలేకపోయాను. శ్రీకాంత్ ని నమ్మి నేను గుడ్డిగా మోసపోయాను. ఇంతకు మించి ఈ విషయం గురించి నేనేమి మాట్లాడలేను’ అంటూ చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడే మాటల్లో కూడా నిజం కనిపిస్తుంది. నిజంగా ఈమె అంత పెద్ద భారీ స్కాం లో చిక్కుకుంటే, ఇంకా ఈమె తెలుగు బుల్లితెర పై డబ్బుల కోసం చిన్న చిన్న షోస్, ఈవెంట్స్ లో పాల్గొనే అవసరం ఏమి ఉంటుంది చెప్పండి?, కచ్చితంగా ఈ ఘటనలో ఈమెకి మాత్రం సంబంధం లేదని మాట్లాడే మాటలను బట్టే తెలుస్తుంది. మరి పోలీసులు ఏమి తెలుస్తారో చూడాలి.
ఇదంతా పక్కన పెడితే రీతూ చౌదరి అసలు పేరు వనం దివ్య. సినీ ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత పేరు మార్చుకుంది. మొదట్లో యాంకర్ గా కెరీర్ ని ప్రారంభించిన ఈమె, ఆ తర్వాత సీరియల్స్ లో లేడీ విలన్ గా బాగా రాణించింది. ఆ తర్వాత కొన్నిరోజులు ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్, శ్రీ దేవి డ్రామా కంపెనీ మరియు ఇతర ఈటీవీ ఎంటర్టైన్మెంట్ షోస్ లో పాల్గొనేది. అప్పుడప్పుడు స్టార్ మా ఛానల్ లో కూడా ఈమె పలు ఈవెంట్స్ లో తళుక్కుమని మెరుస్తూ ఉంటుంది. ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో అప్పుడప్పుడు పాల్గొనే రీతూ, కిరాక్ బాయ్స్, కిలాడి లేడీస్ అనే గేమ్ షోలో కూడా పాల్గొన్నది. బిగ్ బాస్ సీజన్ 8 లో ఒక కంటెస్టెంట్ గా రాబోతుందని అందరూ అనుకున్నారు కానీ, చివరి నిమిషం లో డ్రాప్ అయ్యింది. వచ్చే సీజన్ లో ఈమె కచ్చితంగా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.