https://oktelugu.com/

Game changer : గేమ్ చేంజర్ ను సక్సెస్ చేయడానికి ఈ రెండు సీన్లు సరిపోతాయా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి దక్కని అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న ఏకైక హీరో రామ్ చరణ్... 'గ్లోబల్ స్టార్' గా అవతరించి తనకంటూ ఒక మంచి ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడిగా నిలవడం అంటే మామూలు విషయం కాదు.

Written By:
  • Gopi
  • , Updated On : January 8, 2025 / 01:34 PM IST

    Game changer

    Follow us on

    Game changer : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి దక్కని అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న ఏకైక హీరో రామ్ చరణ్… ‘గ్లోబల్ స్టార్’ గా అవతరించి తనకంటూ ఒక మంచి ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడిగా నిలవడం అంటే మామూలు విషయం కాదు. ఇక మెగాస్టార్ తనయుడి గా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చినప్పటికి మెగా పవర్ స్టార్ గా మంచి ఇమేజ్ ను సొంతం చేసుకొని తండ్రికి తగ్గ తనయుడిగా నిలబడ్డాడు…

    రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా ఈనెల 10 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. మరి ఈ సినిమాతో మెగా అభిమానులు పండుగ చేసుకోబోతున్నారనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక సంక్రాంతి విన్నర్ గా నిలవడమే ధ్యేయంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న ఈ సినిమా యూనిట్ తమదైన రీతిలో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే రాజమండ్రిలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా రావడంతో ఈ సినిమా మీద బజ్ అయితే విపరీతంగా పెరిగిపోయిందనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ కూడా యావత్ ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకుంటుంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో ఒక రెండు పాయింట్స్ మాత్రం హైలెట్ గా నిలువబోతున్నాయనే వార్తలైతే వినిపిస్తున్నాయి. అందులో రామ్ చరణ్ కి ఎస్ జె సూర్య కి మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తున్న సమయంలో వచ్చే సన్నివేశాలు సినిమా మొత్తానికి హైలైట్ గా నిలవబోతున్నాయట.

    అలాగే హెలికాప్టర్ నుంచి రామ్ చరణ్ కత్తి పట్టుకొని దిగే ఫైట్ ఒకటి కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలవబోతుందని సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాకి ఆంధ్రలో ప్రీమియర్ షోస్, బెనిఫిట్ షోస్ ను అలర్ట్ చేశారు. మరి తెలంగాణ ప్రభుత్వం ఇంకా వాటికి పర్మిషన్ ఇచ్చిందా లేదా అనే విషయాలైతే తెలియడం లేదు.

    మరి ఏది ఏమైనా కూడా గేమ్ చేంజర్ సినిమా మొదటిరోజు భారీ కలెక్షన్స్ ని రాబట్టబోతుందనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో రామ్ చరణ్ సూపర్ సక్సెస్ ని అందుకుంటే మరోసారి ‘గ్లోబల్ స్టార్’ గా తనకున్న పేరును బలపరుచుకుంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

    ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ ఒకెత్తయితే ఇకమీదట చేయబోయే సినిమాలు మరొక ఎత్తుగా మారబోతుండటం విశేషం… మరి ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన అదృష్టమనే చెప్పాలి. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరోగా వెలుగుందుతున్న రామ్ చరణ్ తొందర్లోనే నెంబర్ వన్ హీరో పొజిషన్ ని కూడా కైవసం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు…