Jabardasth Naresh Marriage:ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ మన టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కొంతమంది ఈ షో ద్వారా మన ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యారు కానీ, సినిమాల్లో మాత్రం అవకాశాలను సంపాదించలేకపోయారు. అలాంటి వారిలో ఒకరు నరేష్(Jabardasth Naresh). మరగుజ్జు రూపం లో చూసేందుకు చిన్నపిల్లవాడు లాగా అనిపిస్తాడు కానీ,ఇతని వయస్సు దాదాపుగా పాతికేళ్ల పైనే ఉంటుంది. జబర్దస్త్ తో పాటు ఈటీవీ లోకి ప్రసారమయ్యే అన్ని ఎంటర్టైన్మెంట్ షోస్ లోనూ నరేష్ కనిపిస్తూ ఉంటాడు. తన డైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను గత 12 ఏళ్లుగా అలరిస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ జబర్దస్త్ లోనే కొనసాగుతూ ఉన్నాడు. బులెట్ భాస్కర్ టీం తో పాటు హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, చలాకీ చంటి ఇలాంటి అందరి టీమ్స్ లోనూ యాక్టీవ్ గా పాల్గొనే వాడు నరేష్.
Also Read: పవన్ కళ్యాణ్ సపోర్ట్ తో విడుదలైన ది 100 హిట్టా..? ఫట్టా..? ట్విట్టర్ టాక్ ఏంటంటే!
అయితే రీసెంట్ గా ఈయన సరదాగా బులెట్ భాస్కర్ తో ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ ఇంటర్వ్యూ వీడియో లో పెళ్లి గురించి సరదాగా ఒక చర్చ జరుగుతుంది. దానికి క్రింద నెటిజెన్స్ నుండి వచ్చిన కామెంట్స్ చూస్తే అసలు వీళ్ళు మనుషులేనా?, ఇలాంటి వాళ్ళ మధ్య మనం జీవితున్నామా?, ఇంత చెత్తగా,నీచంగా ఎలా ఆలోచిస్తున్నారు? అని అనిపించక తప్పదు. జబర్దస్త్ నరేష్ ఎన్నో కష్టాలుపడి కోట్లాది మందికి ఎంటర్టైన్మెంట్ అందించే స్థాయికి ఎదిగాడు. అలాంటి వ్యక్తిపై అత్యంత నీచమైన కామెంట్స్ పెడుతున్న వాళ్ళ సంగతి ఏంటి?, వాళ్లకు ఉద్యోగం, సద్యోగం లాంటివి ఏమైనా ఉన్నాయా?, నరేష్ పెళ్లి చేసుకుంటే తన భార్యని ఎంతో సంతోషంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోగలడు..మరి అతని పై నీచమైన కామెంట్స్ చేసిన వాళ్ళు కనీసం వాళ్ళ తల్లితండ్రులను పోషించే స్థాయిలో అయినా ఉన్నారా? అనేది వారిలో వాళ్ళు వేసుకోవాల్సిన ప్రశ్న.
Also Read: ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ ట్రైలర్ రివ్యూ : సినిమాలో ఆ ఒక్కటి మైనస్ అయ్యే అవకాశం ఉందా..?
జీవితాంతం కలిసి ఉండడానికి కావాల్సింది ఒక తోడు..మనిషి రూపం కాదు..40 ఏళ్ళు దాటితే ఎంతటి అందమైన తరిగిపోవాల్సిందే. శాశ్వతం కానీ అందం, రూపం గురించి మనిషిని అవహేళన చేయడం ఎందుకు?. ఇంతలా ఎందుకు రియాక్ట్ అవుతున్నామంటే ఒక్కసారి ఆ వీడియో క్రింద కామెంట్స్ ని మీరే చూడండి, క్రింద అందిస్తున్నాము. కనీసం నోటితో పలకడానికి కూడా అసహ్యం కలిగే పదజాలం ఉపయోగించారు. ఇది చాలా పెద్ద తప్పు. కర్మ సిద్ధాంతం దేవుడిని కూడా వదిలిపెట్టడు. నువ్వు ఏదైతే చేస్తావో, అదే నీ జీవితం లో జరుగుతుంది. ఒక వేలు నువ్వు ఎదుటి వ్యక్తి పై చూపిస్తే, నాలుగు వేళ్ళు నీ వైపు చూపిస్తుంది. కాబట్టి ఇలాంటి ఆలోచనలను దయచేసి ఇలాంటి వాళ్ళు దూరం పెట్టాలని కోరుకుందాం.