The 100 Movie Twitter Review: మన చిన్నతనం లో ఎంతో ఇష్టపడి చూసిన సీరియల్స్ కొన్ని ఉంటాయి. వాటిలో ఒకటి అమృతం కచ్చితంగా ఉంటుంది, ఆ తర్వాతి స్థానం లో మంజుల నాయుడు తెరకెక్కించిన ‘మొగలి రేకులు’ సీరియల్ ఉంటుంది. బుల్లితెర హిస్టరీ లో వెయ్యి ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకున్న మొట్టమొదటి సీరియల్ ఇదే. ప్రతీ ఎపిసోడ్ ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ని చూస్తున్నట్టుగానే ఉంటుంది. ముఖ్యంగా ఈ సీరియల్ లో మున్నా, ఆర్కే నాయుడు పాత్రలు పోషించిన సాగర్(RK Sagar) గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. పోలీస్ అంటే బహుశా ఇలాగే ఉండాలేమో అని అనిపించేలా ఈ సీరియల్ లో అత్యద్భుతంగా నటించాడు సాగర్. ఫ్యామిలీ ఆడియన్స్ లో ఈ సీరియల్ తర్వాతనే ఆయనకు క్రేజ్ వేరే లెవెల్ లో పెరిగింది. ఆ క్రేజ్ తో పలు సినిమాలు చేశాడు కానీ, అవి వర్కౌట్ అవ్వలేదు.
ఇప్పుడు రీసెంట్ గా ఆయన ‘100’(The 100) అనే చిత్రం చేశాడు. తన కెరీర్ కి ఎంతో కలిసొచ్చిన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారక్టర్ ని ఇందులో ఆయన పోషించాడు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ని ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) చేతుల మీదుగా చేయించాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తెలంగాణ మంత్రులను ముఖ్య అతిథులుగా పిలిచాడు. ఇలా తన పలుకుబడి ని ఉపయోగించుకొని ఈ సినిమాని చాలా వరకు ప్రమోట్ చేశాడు. అలా భారీ ప్రొమోషన్స్ తో నేడు విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్విట్టర్ లో అయితే ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు, అబ్బో ఈ రేంజ్ లో ఉంటుందని అసలు ఊహించలేదే?, పోలీస్ స్టోరీ అయినప్పటికీ చాలా కొత్త అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు అంటూ మెచ్చుకున్నారు. సాగర్ నటనపై కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
బుల్లితెర పై సూపర్ స్టార్ స్టేటస్ ని సంపాదించుకున్న సాగర్, వెండితెర పై సక్సెస్ అవ్వలేకపోతున్నాడు అని ఆయన అభిమానుల్లో కాస్త నిరాశ ఉండేది. ఈ చిత్రం తో ఆ నిరాశ మాయం అవుతుందో లేదో చూడాలి. సమాజం లో జరిగే అన్యాయాలకు ఎలాంటి న్యాయం జరగాలని మనమంతా కోరుకుంటామో, ఈ సినిమాలో డైరెక్టర్ అదే చూపించాడని, సినిమా మొత్తం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఎంతో ఆకట్టుకుందని అంటున్నారు. ట్విట్టర్ నుండి రివ్యూస్ అయితే బాగానే వచ్చాయి. మరి అవి కలెక్షన్స్ గా మారుతుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ కలెక్షన్స్ రూపం లో మారితే మాత్రం సాగర్ కి మొట్టమొదటి హిట్ పడినట్టే. భవిష్యత్తులో ఆయన హీరో గా మరికొన్ని సినిమాలు చేయడానికి ఈ చిత్రం ఒక ప్లాట్ ఫార్మ్ గా మారుతుంది.
Nina Movie Premieres ki manchi response
Ika Friday nunchi I’m sure it’s going to superb start on Day 1
Premiere ki miss ayya but 1st Day ki matram pakka veltha #The100Movie pic.twitter.com/2QxOhm2G1k— kh!L Kesana (@AlwaysAkhilK) July 10, 2025
Chala bagundhi anna , ninna premiers chusina vallu chepparu ❤️
Saturday weekend set cheyyali .
Cant wait to watch this thrillier #The100Movie pic.twitter.com/RDMXbjQi6Z
— Venu (@VENUNTR71) July 10, 2025
Premieres talk baundhi
mogali rekulu munna movie #The100Movie weekend vellali pic.twitter.com/D424dKjKme— Ramazing Memes (@RRRamazing) July 10, 2025
Reviews are pouring ❤️❤️❤️
Rk anna blockbuster kotteysinatte
Cant to watch this Sunday #The100Movie pic.twitter.com/FmujK8x2VZ
— JAI NTR (@venu_1122) July 10, 2025
Chala bagundi movie action, heroism, emotion
Hero RK Sagar acting #The100Movie
— Dragon ❤️ (@PradeeP_NTR999) July 10, 2025