Hrithik Roshan: బాలీవుడ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకరు హృతిక్ రోషన్(Hrithik Roshan) . ముఖ్యంగా యాక్షన్ జానర్ చిత్రాలకు ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ లాంటోడు. యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హృతిక్ రోషన్ రీసెంట్ గానే అమెరికా పర్యటనకు వెళ్ళాడు. ‘రంగోత్సవ్’ అనే ఈవెంట్ పేరుతో, ‘గ్రీట్ & మీట్’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో హృతిక్ రోషన్ తో కలిసి మాట్లాదోచు, ఆయనతో కలిసి డ్యాన్స్ చేయొచ్చు, సెల్ఫీలు దిగొచ్చు అని నిర్వాహకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారట. అది నమ్మి అభిమానులు లక్షలు పోసి టికెట్స్ కొనుగోలు చేశారు. గంటల తరబడి క్యూ లైన్స్ లో నిల్చొని, చలికి వణుకుతూ తమ అభిమాన హీరో తో కాసేపు సరదాగా గడపొచ్చని అనుకున్నారు. కానీ చివరికి అక్కడ పరిస్థితి తారుమారు అయ్యింది.
Also Read: అలేఖ్య చిట్టి పికిల్స్ పై సెలబ్రెటీ షాకింగ్ వీడియో..
హృతిక్ రోషన్ ఈ ఈవెంట్స్ కి వచ్చాడు, ఉపన్యాసాలు కూడా ఇచ్చాడు కానీ, అభిమానులతో సెల్ఫీలు దిగలేదు, డ్యాన్స్ వేయలేదు. దీంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. నిర్వాహకులు ఎన్నో చెప్పి మా చేత టికెట్స్ కొనుగోలు చేయించారని, కానీ ఇక్కడ చూస్తే హృతిక్ కనీసం మాతో సెల్ఫీ కూడా దిగలేదంటూ విచారం వ్యక్తం చేశారు. ఒక అభిమాని అయితే లక్షా 20 వేల రూపాయిలు ఖర్చు చేసి వచ్చాడట. చివర్లో స్టేజి కి సమీపంగా వెళ్లి హృతిక్ తో ఒక్క సెల్ఫీ కావాలని ప్రాధేయపడితే, ఆయన కుదరదు అని చెప్పాడట. కొంతమంది తల్లితండ్రులు అయితే మా పిల్లలు హృతిక్ లాంటి సూపర్ స్టార్ తో కలిసి డ్యాన్స్ చేసే అవకాశం వస్తుందని ఇక్కడికి వచ్చారు, కానీ అలాంటిదేమి జరగలేదు, స్టేజి మీదకు ఎక్కితే నిర్వాహకులు మమ్మల్ని తోసేశారు, కాస్త తొక్కిసలాట పరిస్థితి ఏర్పడింది అంటూ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు.
ఈరోజు కూడా ఈ ఈవెంట్ న్యూ జెర్సీ లో జరగనుంది. అనంతరం ఏప్రిల్ 12న డల్లాస్ లో, 13న బే ఏరియా లో ఈవెంట్స్ జరగనున్నాయి. కనీసం ఇక్కడైనా ఎలాంటి వివాదాలు లేకుండా జరుగుతాయా లేదా అనేది చూడాలి. హృతిక్ రోషన్ కూడా కాస్త నిర్వాహకులను ఫీడ్ బ్యాక్ ని అడిగి తెలుసుకుంటూ ఉండాలి. ఆయనకు తెలియకుండా అభిమానులను మభ్య పెట్టి భారీగా డబ్బులు దోచేస్తున్నారని సోషల్ మీడియా లో ఒక వాదన వినిపిస్తుంది. ఇది హృతిక్ రోషన్ కి చెడ్డ పేరు తెచ్చే అంశం గా భావించవచ్చు. ఇకపోతే ప్రస్తుతం ఆయన జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) తో కలిసి ‘వార్ 2′(War 2 Movie) అనే చిత్రం చేస్తున్నాడు. షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగష్టు 14 న విడుదల కాబోతుంది. ఈ సినిమా తర్వాత ఆయన స్వీయ దర్శకత్వం లో ‘క్రిష్ 4’ చిత్రం చేయబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.
Also Read: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఎన్టీఆర్ శక్తి సినిమా హీరోయిన్…నెట్టింట గ్లామర్ షోతో రచ్చ…