Chhaava: బాలీవుడ్ లో ఒక సినిమాని అక్కడి ఆడియన్స్ అంత తేలికగా ఆదరించరు. ఒకవేళ ఆదరిస్తే మాత్రం ఆ సినిమాని తీసిన మేకర్స్ అయినా కొన్ని రోజులకు ఆ చిత్రాన్ని వదిలేస్తారేమో కానీ, ఆడియన్స్ మాత్రం వదలరు. అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఖాన్స్ సినిమాలు మాత్రమే ఆడే రోజులు పోయాయి. ఇప్పుడు మన తెలుగు డబ్బింగ్ సినిమాలు కూడా ఇరగకుమ్మేస్తున్నాయి. నిన్న గాక మొన్న ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హీరోలు కూడా సల్మాన్ ఖాన్(Salman Khan) లాంటి సూపర్ స్టార్స్ ని దాటేస్తున్నారు. రీసెంట్ గానే సల్మాన్ ఖాన్ హీరో గా నటించిన ‘సికిందర్'(Sikindar Movie) అనే చిత్రం విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం మొదటి ఆట నుండే బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. ఫలితంగా వసూళ్లు బాగా పడిపోయాయి.
Also Read: అలేఖ్య చిట్టి పికిల్స్ పై సెలబ్రెటీ షాకింగ్ వీడియో..
సల్మాన్ ఖాన్ కాబట్టి ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి కానీ, లాంగ్ రన్ మాత్రం సల్మాన్ ఖాన్ స్టార్ స్టేటస్ కి అవమానకరమైన రేంజ్ లో ఉన్నాయి అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ సినిమా వర్కింగ్ డేస్ లో ఏ స్థాయిలో పడిపోయిందో చెప్పడానికి ఒక ఉదాహరణ తీసుకుందాం. ఫిబ్రవరి 22 న విడుదలైన ‘చావా'(Chhaava Movie) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో మన అందరికీ తెలిసిందే. ఓపెనింగ్స్ నుండి లాంగ్ రన్ వరకు ఈ సినిమా ‘పుష్ప 2’ వసూళ్లను సైతం సవాల్ చేసింది. సినిమా విడుదలై దాదాపుగా 50 రోజులు కావొస్తుంది. కానీ ఇప్పటికీ ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి వసూళ్లు వస్తున్నాయి. అది కూడా నిన్న గాక మొన్న విడుదలైన ‘సికిందర్’ చిత్రాన్ని డామినేట్ చేసే రేంజ్ లో. అనేక సిటీస్ లో ‘చావా’ డైలీ కలెక్షన్స్ కంటే తక్కువ వస్తున్నాయి.
మాస్ సెంటర్స్ కారణంగా కాస్త ‘చావా’ మీద బుక్ మై షో లో ‘సికిందర్’ లీడింగ్ తీసుకుంది. సిటీస్ లో అయితే ‘చావా’ డైలీ కలెక్షన్స్ కి ‘సికిందర్’ దరిదాపుల్లో కూడా లేదు. గడిచిన 24 గంటల్లో ‘చావా’ చిత్రానికి 9 వేల టికెట్స్ బుక్ మై షో లో సేల్ అయితే, ‘సికిందర్’ చిత్రానికి 13 వేల టికెట్స్ సేల్ అయ్యాయి. విడుదలై పది రోజులు కూడా పూర్తి చేసుకోని ఒక సూపర్ స్టార్ సినిమా, ఎప్పుడో 50 రోజుల క్రితం విడుదలైన సినిమాకు డైలీ కలెక్షన్స్ లో పోటీ ఇస్తుందంటే, ఇది సల్మాన్ ఖాన్ కి ఎంత అవమానం అనేది మీరే అర్థం చేసుకోండి. నిన్న ‘సికిందర్’ చిత్రానికి కోటి 20 లక్షల నెట్ వసూళ్లు వస్తే, చావా చిత్రానికి 80 లక్షల నెట్ వసూళ్లు వచ్చాయట. రాబోయే రోజుల్లో ‘సికిందర్’ మీద ‘చావా’ పూర్తి స్థాయి లీడింగ్ తీసుకునే అవకాశం ఉంది.