Sithara Ghattamaneni : సినిమాల్లోకి అడుగుపెట్టకముందే సినీ సెలబ్రిటీల కొడుకులు, కూతుర్లకు మంచి క్రేజ్ ఏర్పడింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా మహేష్ బాబు(Superstar Mahesh Babu) కుమార్తె సితార ఘట్టమనేని(Sithara Ghattamaneni) అంటే కేవలం మహేష్ బాబు అభిమానులకు మాత్రమే కాదు. ఇతర హీరోల అభిమానులకు కూడా ఎంతో ఇష్టం. చిన్న తనంలోనే ఆమె సోషల్ మీడియా లోకి అడుగుపెట్టింది. ఇన్ స్టాగ్రామ్ యాప్ ని సుమారుగా 8 ఏళ్ళ నుండి ఉపయోగిస్తుంది. కేవలం సితార మాత్రమే కాదు, మహేష్ కొడుకు గౌతమ్ కూడా ఇన్ స్టాగ్రామ్ ని రెగ్యులర్ గా ఉపయోగిస్తూ ఉంటాడు. ఇక సితార అయితే తనకు సంబంధించిన ప్రతీ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. రీసెంట్ గా ఆమె అప్లోడ్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి, అవేంటో ఒకసారి చూద్దాం.
Also Read : ‘సికిందర్’ ని డామినేట్ చేస్తున్న ‘చావా’..నిన్న ఎంత గ్రాస్ వచ్చిందంటే!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి(SS Rajamouli) తో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మొదటి షెడ్యూల్ కూడా పూర్తి అయ్యింది. రెండు షెడ్యూల్ మొదలు అయ్యే ముందు కాస్త గ్యాప్ దొరకడంతో ఆయన తన కూతురు సితార తో కలిసి విదేశీ టూర్ వేయడానికి విమానాశ్రయంలో కనిపించిన వీడియో సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో మనమంతా చూసాము. ఇంతకు వీళ్లిద్దరు కలిసి ఏ దేశానికీ వెళ్లారు అంటూ సోషల్ మీడియాలో అభిమానులు ఆరాలు తీస్తూ వచ్చారు. కానీ రీసెంట్ గా సితార పెట్టిన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ చూస్తే వీళ్లిద్దరు కలిసి రోమ్ దేశానికీ వెళ్లినట్టు తెలుస్తుంది. ‘ఐ లవ్ యూ రోమ్’ అంటూ సితార అప్లోడ్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న సితార ని చూసి అభిమానులు ఎంతో మురిసిపోతున్నారు.
ఇకపోతే సితార ఈమధ్య తన తండ్రి తో కలిసి పలు కమర్షియల్ యాడ్స్ లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. చిన్న తనంలోనే తన యాక్టింగ్ టాలెంట్ తో కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్స్ ని అందుకుంటున్న సితార, భవిష్యత్తులో కచ్చితంగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి టాప్ హీరోయిన్ అవుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇదంతా పక్కన పెడితే ఈమె ప్రముఖ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూతురు ఆద్య తో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ ని పెట్టింది. వంశి పైడిపల్లి మహేష్ బాబు కుటుంబానికి ఫ్యామిలీ ఫ్రెండ్ అనే సంగతి మన అందరికీ తెలిసిందే. అలా సితార, ఆద్య లు కూడా బాగా క్లోజ్ అయ్యారు. వీళ్లిద్దరు కలిసి నడుపుతున్న ఈ యూట్యూబ్ ఛానల్ ని ఒక్కసారి చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారంటీ. ఎన్నో క్రియేటివ్ వీడియోలు, ఇంటర్వ్యూస్ అందుబాటులో ఉంటాయి. ఇంత చిన్న వయస్సులో ఇంత టాలెంట్ ఉండడం అనేది సాధారణమైన విషయం కాదు.
Also Read : ‘జాక్’ ఓపెనింగ్స్ అదుర్స్..సైలెంట్ గా వచ్చి దున్నేస్తున్నాడుగా!