Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవడమే కాకుండా వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటి ని కూడా క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో వారసత్వంతో వచ్చిన హీరోలు స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలందరూ పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్లే కావడం విశేషం. ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ తనదైన రీతిలో సత్తా చాటుకున్నాడు. ఇక ఆయన తర్వాత వచ్చిన మహేష్ బాబు ఘట్టమనేని ఫ్యాన్స్ ని ఆనంద పరచడమే కాకుండా తనకంటూ ఒక ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇక మొత్తానికైతే మహేష్ బాబు ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు మూడు సినిమాల్లో ముగ్గురు స్టార్ హీరోలని తన తండ్రిగా తీసుకోవాలని దర్శకనిర్మాతలు అభిప్రాయపడ్డారు. కానీ చివరి నిమిషంలో మాత్రం అది సెట్ అవ్వలేదు. ఇంతకీ ఆ సినిమాలేంటి? ఆ స్టార్ హీరోలు ఎవరు అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
పోకిరి
మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి ‘ సినిమా అప్పటివరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులన్నింటిని తిరగరాస్తు భారీ విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు తండ్రిగా నాజర్ నటించాడు. ఇక నాజర్ పాత్ర కోసం మొదట పూరి జగన్నాథ్ కమలహాసన్ ను ఆ పాత్రలో నటింపజేయాలని అనుకున్నారట. కానీ కమల్ హాసన్ మాత్రం ఆ పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేదని ఆ క్యారెక్టర్ ని రిజెక్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తానికైతే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నాజర్ కి చాలా మంచి గుర్తింపు రావడమే కాకుండా ఆయన పాత్ర కూడా ఈ సినిమాలో బాగా ఎలివేట్ అయిందనే చెప్పాలి…
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
ఇక ఈ సినిమాలో వెంకటేష్, మహేష్ బాబు ఇద్దరూ అన్నదమ్ములుగా నటించిన విషయం మనకు తెలిసిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీ మల్టీస్టారర్ సినిమాలకు తెరలేపిన సినిమా కూడా ఇదే కావడం విశేషం…ఇక ఈ సినిమాలో మహేష్ బాబు తండ్రిగా రజినీకాంత్ నటిస్తే బాగుంటుందని దిల్ రాజు అనుకున్నాడట. ఇక అందులో భాగంగానే డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల, ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇద్దరు కలిసి రజనీకాంత్ కి కథ కూడా వినిపించారు. రజినీకాంత్ కూడా ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ అనుకోని కారణాలవల్ల అప్పుడు ఆయనకు హెల్త్ బాగలేకపోవడంతో ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది…
వన్ నేనొక్కడినే
ఇక ఈ సినిమాలో కూడా మహేష్ బాబు తండ్రి పాత్రకి చాలా ప్రాధాన్యత అయితే ఉంటుంది. అయితే ఈ పాత్రలో మలయాళ స్టార్ హీరో అయిన మమ్ముట్టిని తీసుకోవాలనే ప్రయత్నం చేసినప్పటికి ఆయన ఎప్పుడూ తన డేట్స్ ను అడ్జస్ట్ చేయలేకపోవడంతో ఆ పాత్రను వదులుకోవాల్సి వచ్చింది.
ఇక మొత్తానికైతే మహేష్ బాబు సినిమాలో ముగ్గురు స్టార్ హీరోలు తన తండ్రి పాత్రలను చేయాల్సింది. కానీ అనుకొని కారణాల వల్ల మిస్ అయిపోయారనే చెప్పాలి…