Maharashtra Election results 2024 : మహారాష్ట్రలో మహాయుతి జోరు కొనసాగుతోంది. మహా వికాస్ అఘాడీ కన్నా 100 సీట్లలో లీడింగ్‌లో ఉంది. దీంతో మహాయుతి అధికారంలోకి రావడం దాదాపు ఖాయమైంది. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమిలో శివసేన(షిండే), ఎన్‌సీపీ(అజితపవార్) పార్టీలు ఉన్నాయి. కూటమిలో బీజేపీ మెజారిటీ సీట్లలో పోటీ చేసింది. బీజేపీ 106 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. శివసేన 45, ఎన్‌సీపీ 26 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. మహాయుతి అధికారంలోకి రావడం ఖాయం అయిన నేపథ్యంలో సీఎం ఎవరు అన్న చర్చ మొదలైంది. లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించిన బీజేపీకే సీఎం సీటు ఖాయం అన్న వార్తలు వస్తున్నాయి.
48 గంటలే సమయం..
మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కేవలం 48 గంటల సమయమే ఉంది. ఈ నేపథ్యంలో సీఎం ఎంపిక ఆదివారం(నవంబర్ 24న) జరిగే అవకాశం ఉంది. మహాయుతి కూటమిలోని బీజేపీ నుంచే సీఎం అవుతారన్న చర్చ జరుగుతోంది. మహారాష్ట్రలో సీఎం అభ్యర్థిని మహాయుతి ఇప్పటి వరకు ప్రకటించలేదు. అయితే సీఎం రేసులో బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు. ఏక్‌నాథ్‌షిండే కూడా మరోమారు సీఎం పదవి ఆశిస్తున్నారు. అయితే.. గతంలో వీరిలో షిండే సీఎంగా ఉండగా, ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఈసారి బీజేపీ నేతృత్వంలోని కూటమి విజయం సాధిస్తుంది. గతంలో సాధించిన సీట్లకన్నా ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం 109 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో ఫడ్నవీస్ సీఎం అవుతారని, ఏక్‌నాథ్‌షిండే డిప్యూటీ సీఎం అవుతారని ప్రచారం జరుగుతోంది.
రేసులో అజిత్ పవార్ కూడా..
ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ కూడా ఉన్నారు. ఆయన చొరవతోనే బీజేపీ, శివసేన(షిండే) మధ్య పొత్తు కుదిరింది. ఫలితాలు ఎలా వచ్చినా.. ఎన్‌సీపీ(అజిత్ పవార్) పార్టీ కీలకమవుతుందని అంనా వేశారు. కానీ ప్రస్తుతం బీజేపీ గతంలోకన్నా ఎక్కువ స్థానాల్లో గెలిచే అవకాశం కనిపిస్తోంది. ఎన్‌సీపీ సీట్లు కీలకం అయితే సీఎం పదవి అడగాలని భావించారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి, అవకాశం లేదని తెలుస్తోంది.