IND Vs AUS : రెండో రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే కెప్టెన్ బుమ్రా అదరగొట్టాడు. వికెట్ కీపర్ క్యారీ(21) ని అవుట్ చేశాడు. ఆ తర్వాత మరో బౌలర్ హర్షిత్ రాణా నాథన్ లయన్(5) ను వెనక్కి పంపించాడు. రెండో రోజు రెండు వికెట్లు పడగొట్టడం ద్వారా హర్షిత్ రాణా తన ఖాతాలో మూడు వికెట్లను వేసుకున్నాడు. బుమ్రా అలెక్స్ కేరీ(21) ని అవుట్ చేయడం ద్వారా ఐదు వికెట్ల ఘనతను సొంతం చేసుకున్నాడు. తద్వారా టీమిండియా లెజెండరీ కెప్టెన్ కపిల్ దేవ్ సరసన చేరాడు. కపిల్ దేవ్ ఏడుసార్లు ఐదు వికెట్ల రికార్డును సృష్టించాడు. బుమ్రా కూడా ఏడుసార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. తద్వారా కపిల్ దేవ్ రికార్డును సమం చేశాడు. 51 ఇన్నింగ్స్ లలో బుమ్రా ఈ రికార్డును అందుకున్నాడు. కపిల్ దేవ్ 62 ఇన్నింగ్స్ లలో ఈ ఘనతను సాధించాడు. ఈ ప్రకారం చూసుకుంటే బుమ్రా 11సార్లు ఐదు వికెట్ల ఘనతను సొంతం చేసుకున్నాడు.
100 పరుగులోపే..
శనివారం రెండవ రోజు ఆట ప్రారంభమైన తర్వాత ఆస్ట్రేలియా జట్టు 100 పరుగుల లోపే ఆల్ అవుట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆస్ట్రేలియా బౌలర్ స్టార్క్(26) భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. క్రీజ్ లో పాతుకుపోయిన అతడు 112 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్ల సహాయంతో 26 పరుగులు చేశాడు. అలెక్స్ కేరి (21), హేజిల్ ఉడ్(7), నాథన్ లయన్(5) పరుగులు చేశారు. ఫలితంగా ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా 104 పరుగులు చేసింది. టీమిండియా అనుకున్న దానికంటే ఆస్ట్రేలియా నాలుగు పరుగులు ఎక్కువ చేసింది. వాస్తవానికి ఆస్ట్రేలియాను వందపరుగుల లోపు ఆల్ అవుట్ చేయాలని టీమిండియా భావించింది. కానీ ఆస్ట్రేలియా నాలుగు పరుగులు ఎక్కువ చేసింది. ఫలితంగా టీమ్ ఇండియాకు 46 పరుగుల లీడ్ లభించింది.
మైదానంపై ఉన్న తేమను టీమిండియా బౌలర్లు సమర్ధవంతంగా ఉపయోగించుకున్నారు.. పదునైన బంతులు వేస్తూ ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించారు.. దీంతో స్వదేశంలో ఆస్ట్రేలియా బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. క్రీజ్ లో నిలబడేందుకు నానా తంటాలు పడ్డారు. దూసుకు వస్తున్న బంతులను ఎదుర్కోలేక చేతులెత్తేశారు. కీలకమైన ఆటగాళ్లు సైతం భారత బౌలర్లను తట్టుకోలేక తలవంచారు. బుమ్రా బౌలింగ్ లో అయితే ఏమాత్రం నిలబడలేకపోయారు.. హర్షిత్ రాణా సైతం బుమ్రాకు తగ్గట్టుగా బౌలింగ్ వేయడంతో ఆస్ట్రేలియా బ్యాటర్లకు చుక్కలు కనిపించాయి. శనివారం రెండవ రోజు హర్షిత్ ఏకంగా కీలకమైన రెండు వికెట్లను పడగొట్టి అదరగొట్టాడు. దీంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 104 పరుగుల వద్ద ముగిసింది.