Homeఎంటర్టైన్మెంట్Honey Rose: అందం కోసం సర్జరీ చేయించుకున్న హనీ రోజ్? బాలయ్య హీరోయిన్ ఏమందంటే!

Honey Rose: అందం కోసం సర్జరీ చేయించుకున్న హనీ రోజ్? బాలయ్య హీరోయిన్ ఏమందంటే!

Honey Rose: వీరసింహారెడ్డి మూవీలో బాలయ్య భార్యగా, తల్లిగా చేసింది హనీ రోజ్. ఆరుపదుల దాటిన బాలయ్యకు అమ్మగా చేసిన ఈ మలయాళ హీరోయిన్ హనీ రోజ్ వయసు తెలిస్తే షాక్ అవుతారు. హనీ రోజ్ వయసు కేవలం 31 ఏళ్లు. హనీ రోజ్ చాలా చిన్న వయసులో పరిశ్రమలో అడుగు పెట్టింది. ఆమె డెబ్యూ మూవీ బాయ్ ఫ్రెండ్ 2005లో విడుదలైంది. హనీ రోజ్ ఫస్ట్ తెలుగు మూవీ ఆలయం. 2008లో విడుదలైన ఈ మూవీలో శివాజీ హీరోగా నటించాడు. ఆ సినిమా అంతగా ఆడలేదు. తెలుగు దర్శక నిర్మాతలు ఆమెను పట్టించుకోలేదు.

భారీ గ్యాప్ తీసుకుని వరుణ్ సందేశ్ కి జంటగా ‘ఈ వర్షం సాక్షిగా’ టైటిల్ తో రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ చేసింది. ఈ మూవీ కూడా అనుకున్న స్థాయిలో ఆడలేదు. తొమ్మిదేళ్ల అనంతరం వీరసింహారెడ్డి మూవీతో టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇచ్చింది. . సంక్రాంతి కానుకగా విడుదలైన వీరసింహారెడ్డి హిట్ టాక్ తెచ్చుకుంది. హనీ రోజ్ కి ఈ చిత్రం టాలీవుడ్ లో సైతం ఫేమ్ తెచ్చిపెట్టింది.

బాలయ్య వంటి లెజెండ్ పక్కన నటించే ఛాన్స్ రావడం అదృష్టం అని హనీ రోజ్ అన్నారు. ఇటీవల హనీ రోజ్ రాచల్ టైటిల్ తో పాన్ ఇండియా మూవీ ప్రకటించింది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. రాచల్ పోస్టర్ లో హనీ రోజ్ లుక్ బోల్డ్ గా ఉంది. కాగా హనీ రోజ్ పై ఒక రూమర్ చక్కర్లు కొడుతుండగా ఆమె స్పందించారు. అవన్నీ పుకార్లే అని కొట్టిపారేశారు.

అందం కోసం హనీ రోజ్ సర్జరీలు చేయించుకున్నారని కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలకు సమాధానంగా… నేను ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదు. నాది సహజ అందమే. గ్లామర్ కోసం కాస్మటిక్స్ వాడతాను. సర్జరీల జోలికి పోలేదు. ఇక నటిగా ఉండటం అంత సులభం కాదని, ఆమె చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో మంచి, చెడు రెండూ ఉంటాయి. కాబట్టి నేను సోషల్ మీడియా కామెంట్స్, ట్రోల్స్ సీరియస్ గా తీసుకోనని ఆమె గతంలో వెల్లడించారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...
Oktelugu Epaper
Exit mobile version