Baby Movie: బేబీ సినిమాని ఎందుకు ఆ కోణంలో ఎవరూ చూడటం లేదు

నిజంగా ఆర్ఎక్స్ 100 సినిమాలో హీరోయిన్ లాంటి పాత్ర వైష్ణవి ది అయితే,‌ ఆనంద్ కోసం చెయ్యి కోసుకునే అంత స్థాయికి వచ్చుండదు వైష్ణవి. ఇక అంత జరిగాక కూడా తాను ఆనంద్ దగ్గరికి వెళ్లి పెళ్లి చేసుకోమని వెళుతుంది. అయితే ఆనంద్ అక్కడ నేను ఏమన్నా హీరో నా నిన్ను యాక్సెప్ట్ చెయ్యడానికి అంటాడు.

Written By: Swathi, Updated On : July 26, 2023 6:44 pm

Baby Movie

Follow us on

Baby Movie: ప్రస్తుతం తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సినిమా బేబీ. ఈ సంవత్సరం టాప్ హీరోలు కూడా సొంతం చేసుకోని కలెక్షన్స్ ఈ సినిమా సొంతం చేసుకొని అందరిని ఆశ్చర్యపరుస్తోంది.

యూత్ కి విపరీతంగా కనెక్ట్ అయిన ఈ చిత్రం, మొదటి టీజర్ నుంచే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చింది. ఇక విడుదలైన తరువాత రోజు రోజుకి కలెక్షన్లు పెంచుకుంటూ వెళుతుంది. అయితే అలాంటి ఈ చిత్రం పైన ఎన్నో విమర్శలు కూడా ఉన్నాయి. అందులో మొదటి విమర్శ ఈ సినిమా అమ్మాయిల కన్నా కూడా అబ్బాయిలకే నచ్చుతుంది అని. ఎందుకు అంటే ఈ చిత్రంలో హీరోయిన్ ని తక్కువ చేసి చూపించారు అని. ముఖ్యంగా ఈ సినిమాని ఆర్ఎక్స్ 100 సినిమాతో పోల్చడంతో, చాలామంది ఫ్యామిలీలు అలానే అమ్మాయిలు కూడా ఈ సినిమాకు కొంచెం దూరంగా ఉన్నారు.

అయితే ఈ సినిమా కరెక్ట్ గా చూసిన వారికి మాత్రం ఈ చిత్రంలో డైరెక్టర్ ఇద్దరు అబ్బాయిల కన్నా ఎక్కువ అమ్మాయికే విలువిచ్చి తీశారు అని అర్థమవుతుంది. కానీ అది అర్థం అవ్వాలి అంటే మనం చూసే విధానం మారాలి.

మొదటి సీన్ లోనే దర్శకుడు సాయి రాజేష్ హీరోయిన్ క్యారెక్టర్ ని హైలెట్ చేశారు. అది ఎలాగా అంటే తన స్కూల్ ఏజ్ లో టీచర్ ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయికి రాఖీ కట్టాలి అన్నప్పుడు, వైష్ణవి మాత్రం తాను ప్రేమించిన ఆనంద్ కి రాఖీ కట్టకుండా టీచర్ దగ్గర దెబ్బలు తింటుంది. అలా తను దెబ్బలు అయినా తింటుంది కానీ తన నిర్ణయాన్ని మాత్రం కించపరుచుకోడు అని, అలానే తన ప్రేమ కోసం ఏమైనా చేస్తుంది అని చెప్పకనే చెప్పారు దర్శకుడు.

ఇక పోయే కొద్ది కూడా వైష్ణవి ఆనంద్ ని ఎంతో విపరీతంగానే ప్రేమిస్తూ వస్తుంది. అంతేకాకుండా ముద్దుకి.. హగ్గు కి దూరంగా ఉంటూ.. స్వచ్ఛమైన ప్రేమతో ఆనంద్ తో కాలం గడుపుతూ ఉంటుంది వైష్ణవి. ఇక ఆ తరువాత తాను కాలేజీలో జాయిన్ అయినప్పటి నుంచే సమస్యలు మొదలవుతాయి. అయితే అక్కడ కూడా వైష్ణవి తప్పు ఏమీ ఉండదు. ఎందుకు అంటే కాలేజీలో తనను అందరూ ముందుగా చిన్న చూపు చూడడంతో, తాను తక్కువ కాకూడదని ..అక్కడ వారికి అనుకూలంగా అందంగా తయారు అవుతుంది. అది ఏదో ఇంగ్లీష్ సామెత ‘ డి లైక్ ఏ రోమన్ వైల్ యు ఆర్ ఇన్ రోమ్’ అన్నట్టుగా ఆ కాలేజీకి అనుకూలంగా మారుతుంది.

ఇక ఆ కాలేజీలో ఎంతో హ్యాండ్సమ్ గా కనిపించే వీరాజ్ లాంటి అబ్బాయి తనను ప్రేమించిన కానీ వైష్ణవి మాత్రం ఆనంద్ నే ప్రేమిస్తూ ఉంటుంది.
అందుకే వీరాజ్ ప్రేమని ఎక్కడ యాక్సెప్ట్ చేయదు. కానీ కొన్ని సందర్భాల వల్ల ఆనంద్ వైష్ణవి ని అనకూడని మాట అంటారు. దాంతో బాగా హర్ట్ అయిన వైష్ణవి పబ్ కి వెళ్లి తాగి మాట్లాడిన మాటలు ప్రతి అమ్మాయికి నచ్చక మానవు. ముఖ్యంగా నువ్వు కొడితే కూడా నీ కాళ్ళ దగ్గర పడి ఉండాలా, మేము కొట్టలేమనే కదా మీకు ఇంత అహం అని వైష్ణవి చెప్పే మాటలు నిజమే కదా అనిపిస్తుంది. ఇక ఆ తరువాత తాగేసిన మత్తులో వైష్ణవి చేసిన ఒక్క తప్పు తన జీవితాన్ని మార్చేస్తుంది.

అయితే దానివల్ల ఎన్ని సమస్యలు వచ్చినా ఎలాగో ఒకలాగా ఏదో ఒకటి చేసి విరాజ్ ని వదిలించుకొని ఆనంద్ తో ఉండాలి అనుకుంటుందే తప్ప, ఆనంద్ ని వదిలేసి విరాజ్ తో ఉండి పోదాం అనుకోడు.
వైష్ణవి తన స్వార్థం చూసుకునే అమ్మాయి అయితే అందం మరియు డబ్బులు ఉన్న విరాజ్ నా పెళ్లి చేసుకోవచ్చు. కానీ తాను అలా చేయదు. ఆఖరికి రోడ్ పైన పడి చెయ్యి కోసుకునే పరిస్థితికి చేరుతుంది వైష్ణవి. అయితే మొదటి సీన్ లో చూపించినట్టు ఎలా అయితే దెబ్బలు తిన్నా కూడా ఆనంద్ కి రాఖీ కత్తకూడదు అనుకుంటుందో.. అలానే ఇక్కడ కూడా తన జీవితంపై అంత దెబ్బ పడిన ఆనంద్ ని వదలకూడదు అనుకుంటుంది.

నిజంగా ఆర్ఎక్స్ 100 సినిమాలో హీరోయిన్ లాంటి పాత్ర వైష్ణవి ది అయితే,‌ ఆనంద్ కోసం చెయ్యి కోసుకునే అంత స్థాయికి వచ్చుండదు వైష్ణవి. ఇక అంత జరిగాక కూడా తాను ఆనంద్ దగ్గరికి వెళ్లి పెళ్లి చేసుకోమని వెళుతుంది. అయితే ఆనంద్ అక్కడ నేను ఏమన్నా హీరో నా నిన్ను యాక్సెప్ట్ చెయ్యడానికి అంటాడు. మరి వైష్ణవి కూడా మన రొటీన్ తెలుగు సినిమాలలో హీరోయిన్ కాదు కాబట్టి, తాను ఆనంద్ లాగా తన తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఉండే అమ్మాయి కాదు కాబట్టి చివర్లో వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. అయితే అక్కడ కూడా ఆనంద్ ని చూసినప్పుడు వైష్ణవి కళ్ళల్లో మనకి కన్నీళ్లు కనిపిస్తాయి. అంటే దీనికి అర్థం పరిస్థితులు వైష్ణవి ని మార్చిన, తన మొదటి ప్రేమను మాత్రం మొదటి రోజు నుంచి చివరి వరకు మార్చలేదు అని.

కాబట్టి ఒక అబ్బాయిని ఎంతగా ప్రేమించిన పరిస్థితుల వల్ల పెళ్లి చేసుకోలేకపోయినా అమ్మాయిలకి కూడా ఈ సినిమా నచ్చక మానదు. మరి ఎందుకు చాలామంది బేబీ సినిమాని ఈ కోణంలో చూడడం లేదు అనేది కొంతమందికి ఉన్న సందేహం.